Mahanaadu-Logo-PNG-Large

జూన్‌ 4 తర్వాత యరపతినేని మార్క్‌ రాజకీయం

కాసు మహేష్‌రెడ్డికి బుద్ధి చెప్పడం తథ్యం
పెట్రోల్‌ బాంబులు, నాటు బాంబులతో తెగబడ్డారు
గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు
తంగెడలో బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం

గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో పోలింగ్‌ సందర్భంగా సోమవారం జరిగిన విధ్వంసకరమైన ఘటనకు సంబంధించి గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తంగెడ గ్రామంలో వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారని, ఓడిపోతారు అనే భయంతో కాసు మహేష్‌ రెడ్డి అనుచరులు గ్రామంలో నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులతో దాడికి తెగబడ్డారని ధ్వజమెత్తారు. ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన దివ్యాంగులు అయిన షేక్‌ నబి, తండా జానీబాషా షాపులపై బాంబులు వేసి తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాసు మహేష్‌రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. అనంతరం నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని, గురజాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో తీసుకెళ్లి యరపతినేని మార్కు రాజకీయాన్ని చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.