-అప్పుడు టెన్త్…ఇప్పుడు నిశాని…
-అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని పిటిషన్
వినుకొండ, మహానాడు: వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని కోరుతూ శుక్రవారం న్యాయవాదులు మూర్తి, గోపి, జై భారత్ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయక్ వేర్వేరుగా కౌంటర్, అఫిడవిట్, పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెదకూరపాడులో వైసీపీ అభ్యర్థిగా బొల్లా పోటీి చేసినప్పుడు డిగ్రీ చదివినట్లు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారని, ఇప్పుడు వినుకొండలో నిశాని అని అఫిడవిట్ సమర్పించినట్లు తెలిపారు. ఇది అబద్ధపు సమాచారంతో కూడినదని తెలిపారు. ఆర్వో ప్రొసీజర్ పాటించాలని, లేకుంటే హైకోర్టుకు ఆశ్రయిస్తామని తెలిపారు.