సచివాలయం, వెలగపూడి: పవన్‌కళ్యాణ్, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని శనివారం ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. వీటికి సంబంధించి మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి ఆధారాలను అందచేశారు. ఈనెల 26న రాజోలులో పవన్‌కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఈ నెల 26న దెందులూరులో దళితులపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.