టీడీపీ అభ్యర్థిపై వైసీపీ ఫిర్యాదు

సచివాలయం, వెలగపూడి, మహానాడు : డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచారని, ఇది మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు విరుద్ధమన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను పార్టీ నాయకులు మల్లాది విష్ణు, గ్రీవెన్స్‌ సెల్‌ చైర్మన్‌ నారాయణమూర్తి అందచేశారు.