వైసీపీది విధ్వంస మార్గం.. టీడీపీది అభివృద్ధి మార్గం

– తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 

దర్శి, మహానాడు: వైసీపీది విధ్వంస మార్గం.. టీడీపీది అభివృద్ధి మార్గమని దర్శి  తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి నగర పంచాయతీ లోని 19వ వార్డ్ లో సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా లక్ష్మీ మాట్లాడుతూ…  ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి ప్రజల నాడి తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ సారధ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పరుగులు తీస్తూ పనిచేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా నిరూపిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రోత్సహిద్దామన్నారు.

ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చి దోపిడీని అరికట్టి భవన నిర్మాణ కార్మికులను, ప్రజలను ఆదుకున్న ప్రభుత్వంగా ప్రజలు చంద్రన్నకు మన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్నారన్నారు.  రాజకీయం కోసం కొందరు ఇసుక పాలసీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ ప్రజలకు తెలుసన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెంచిన పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ, నేరుగా కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్, త్వరలో అన్నా క్యాంటీన్ ల ఏర్పాటు,  మహిళలకు ఉచిత బస్సు సర్వీసు,  ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం కోసం మన సీఎం చంద్రబాబునాయుడు నిరంతర శ్రామికుని వలే పని చేస్తున్నారన్నారు.

సీఎం స్ఫూర్తితో దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఆనాడు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దర్శిని మార్గదర్శకంగా  మార్చుకుందామన్నారు.  దర్శి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని లక్ష్మి అన్నారు. ఇందులో భాగంగా నిన్న కలెక్టర్ ని కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వివరించి అభివృద్ధికి సహకరించాలని కోరాను. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు,  జిల్లా ఉన్నతాధికారులతో నిరంతరం మాట్లాడుతూ దర్శిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నా వంతు కృషి చేస్తూనే ఉంటానన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు. వెనుకబడిన దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా చూడాలన్నదే నా అభిలాష.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దర్శి నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలతో పోటీపడి మన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కోసం పాటుపడదామని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వార్డ్ కౌన్సిలర్ దారం నాగవేణి – సుబ్బారావు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.