వైసీపీలో నియంతృత్వ పోకడల వల్లే బయటకు…
అరవిందబాబు, శ్రీకృష్ణదేవరాయలు విజయానికి కృషి చేస్తా
నరసరావుపేట, మహానాడు : రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నేత కాటం రామిరెడ్డి ఆదివారం ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరా యలు, చదలవాడ అరవిందబాబు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి లావు, చదలవాడ పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం మండలం లో జరుగుతున్న నాయకత్వ దోరణి, విలువ లేని విధానాల వల్లనే పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం అభివృద్ధి సాధించాలని తపనపడే లావు శ్రీకృష్ణదేవరాయలు వెంటే మా ప్రయాణం ఉంటుందని తెలిపారు.
చదలవాడ అరవిందబాబు, లావు శ్రీకృష్ణదేవరాయలు విజయానికి కృషిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడు తూ.. రామిరెడ్డి వంటి ముఖ్య నేతలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మరలటం తమ విజయానికి సూచికమని తెలిపారు. వైసీపీకి చెందిన ఐ ప్యాక్ టీం సర్వేలు, అసత్య ప్రచారా లను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు.