వైసీపీ నేతలారా… చేతనైతే సాయం చేయండి.. విమర్శలొద్దు!

– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

విజయవాడ, మహానాడు: వైసీపీ నేతలకు వరదల గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడ జక్కంపూడిలో శుక్రవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు వైద్యం అందిస్తున్న మెడికల్ క్యాంపులు పరిశీలించారు. ఫిట్స్ వచ్చిన మహిళకు దగ్గరుండి వైద్యం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొంత జిల్లాలో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టడం చేతకాని వైవీ సుబ్బారెడ్డి నేడు వరదలపై మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను మా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటోంది… . వైసీపీ నేతలకు చేతనైతే సాయం చేయాలి తప్ప… తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్లో వరద బాధితులకు అందించనున్న నిత్యవసర సరుకులను పరిశీలించారు.