కౌంటింగ్‌కు ఏజెంట్లుగా అనుమతించొద్దు
మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి
మాచర్ల, మహానాడు : ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు కారకులైన వైసీపీ నేతలను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకం టి బ్రహ్మారెడ్డి కోరారు. వీరిని కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించకూ డదని సూచించారు. ఈసీ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ రోజు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఎస్ జవహర్‌రెడ్డి కనుసన్నల్లో వైసీపీ మూకలు దాడులకు యత్నించాయని ఆరోపించారు.