పాత సీసాలో పాత సారలా ఉంది
మరోసారి మోసగించేందుకు నాటకాలు
బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్
విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టో పాత సీసాలో పాత సారాలా ఉందని విమ ర్శించారు. మేనిఫెస్టోలో కొత్తదనం లేదని, 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా మళ్లీ పాత పాటే పాడుతున్నారని అన్నారు. అమ్మఒడి 15 వేల నుంచి 17 వేలకు పెంపుపై స్పందిస్తూ ఇప్పటికే అమ్మఒడి నాన్న బుడ్డీకి పోతున్నాయి. రూ.15 వేలు ఇచ్చి రూ.30 వేలు జగన్ విద్యుత్ చార్జీలు పెంచి లాగుతున్నారు. ఇక 2019లో బడ్జెట్ సైజ్ ఎంత? 2024లో ఎంత? ఇప్పుడు హామీ రూ.17 వేలు అంటే పెంచింది ఎంత? అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంట్రిబ్యూషన్ కొనసాగింపుపై మాట్లాడుతూ వైఎస్ కాంట్రిబ్యూషన్ అంటే రాష్ట్రాన్ని దోచుకోవడమా (భూములు, నిధులు, వనరులు), సమాజాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా చీల్చడమా? స్వంత చెల్లెళ్లను బజారుకు ఈడ్చడమా? ఆర్థిక, సామాజిక, అరాచక, విధ్వంస పాలన చేయడమా? మరో 100 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనుకకు నెట్టడమా? అని అడిగారు. కాపు నేస్తం కొనసాగిస్తామని చెబుతున్నారు..అది కాపు నేస్తం కాదు..కాపుల నెత్తి మీద రిక్త హస్తమని వ్యాఖ్యానించారు.
మహిళలకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అంటున్నారు… కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ 75 శాతం ఇందులో ఉంది అనే సంగతి చెప్పకపోవడం మోసమన్నారు. పెన్షన్ రూ.3 వేల నుంచి 3,500కు పెంచుతామని చెప్పారు. 2019 ఎన్నికలలో రూ.3 వేలు హామీ ఇచ్చి ఎప్పు డి నుంచి ఇచ్చారు? ఇప్పుడు అలాగే మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. కళ్యాణమస్తు, షాదీతోఫా ఇస్తామని చెబుతున్న మీరు గత ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా మోసగించిన ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలా నమ్ముతారని అన్నారు. అందరికీ ఇళ్ల నిర్మాణం అంటూ 2019లో 30 లక్షల ఇళ్లు చేతిలో పెడతానని చెప్పి అంతకుముందు పూర్తయిన ఇళ్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. పేదలకు రూ.2 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం అంటున్నారు.. కేంద్ర ప్రభుత్వం రూ.34 వేల కోట్లు ఇస్తే వాటితో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నాటకాలు అడారు. రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామని అంటున్న మీరు 2019లో కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా రూ.12,500 అని చెప్పారు. కానీ జగన్ రూ.7,500 మాత్రమే ఇచ్చి గత ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.25000 బాకీ పడ్డారు. ఇప్పడు రూ.16 వేలు అనడం మరో భూటకం. ఆరోగ్యశ్రీ పరిధి విస్తరణ అంటూ ఆసుపత్రులకు బిల్లులు కట్టకపోవటంతో పేద రోగులు ఇక్కట్ల పాల య్యా రు. పీఎం ఆయుష్మాన్ భారత్ నిధులతో నెట్టుకువస్తున్నారని తెలిపారు.