Mahanaadu-Logo-PNG-Large

వారంలో వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్‌

పులివెందులలో నామరూపం కాబోతుంది
బీజేపీకి నాయకులు లైన్‌ కడుతున్నారు
లిక్కర్‌ కుంభకోణంలో భారతి హస్తం
భారతి రాజ్యాంగంతో వ్యవస్థల భ్రష్టు
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

విజయవాడ: జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌ రెడ్డిలతో భేóటీ అయ్యారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు ఇచ్చి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వివేకా కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిపై చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీజేపీలో చేరుతామని క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలి కారని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లోపే వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్‌కు సిద్ధం అవుతున్నారు. పులివెందులలో వైసీపీ నామరూపం కాబోతుంది. ఆ పార్టీ నాయ కులు బీజేపీకి లైన్‌ కడుతున్నారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతి రాజ్యాంగం అధికారంలోకి తీసుకొచ్చారని, ఢల్లీి లిక్కర్‌ కేసులో భారతి హస్తం ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారన్నారు. రాష్ట్రంలో కూటమి గెలుపునకు పవన్‌ కళ్యాణ్‌ తోడ్పడ్డారని తెలిపారు. జమ్మలమడుగులో కేంద్రం ఇచ్చిన 23 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చాము. అవన్నీ కట్టి తీరుతామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ కార్యక ర్తలను కూడా ఇబ్బంది పెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో కూటమి ప్రధాన పాత్ర పోషించబోతుందని వ్యాఖ్యానించారు.