అమరావతి, మహానాడు: వైకాపా ఎమ్మెల్సీ టీడీపీలో చేరిక లాంఛన ప్రాయమేనని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేశ్ను శనివారం కలిశారు. ఇప్పటికే మంత్రి ఫరూక్తో భేటీ అయిన జకియా ఖానం, లోకేశ్ని కుటుంబ సమేతంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జగన్ సహా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్ని బహిష్కరించినా, జకియా ఖానం మండలికి హాజరవుతున్నారు. త్వరలో ఆమె తెలుగుదేశంలో చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.