Mahanaadu-Logo-PNG-Large

తెలంగాణలో ఎల్లో అలెర్ట్‌ జారీ

 మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని… ఉరుములు, మెరుపులతో వర్షం కురువవచ్చునని తెలిపింది.

గురువారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్‌లో వర్షాలు కురువవచ్చునని పేర్కొంది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

శుక్రవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో, శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.