నీ పెళ్లాలు.. మెగా కుటుంబంలో ఆడోళ్ల సంగతేంటి?

ముందు వారికి భరోసా ఇవ్వు
నా కుమార్తెను బయటకు లాగావు..నాటకాలు ఆపు
పవన్‌కళ్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం కౌంటర్‌
నేను చచ్చినా ఇంటికి రావద్దని కుమార్తెకు సూచన

జగ్గంపేట, మహానాడు : పొన్నూరు సభలో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కౌంటర్‌ ఇచ్చారు. జగ్గంపేటలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నా కూతురిని మీకు అనుకూలంగా మార్చుకున్నారు..కుటుంబాన్ని బయటకు లాగారు. ఆమె నా బిడ్డ కాదు అత్తింటి వారి బిడ్డ. కుటుంబాలను లాగారు కాబట్టి నేను కూడా లాగాల్సి వస్తుంది. మీ ముగ్గురి భార్యలను పరిచయం చేయగలరా అంటూ చురకంటించారు. మీ పెళ్లాల స్థితిగతులు ఏమిటి? మీ ఇంటి వారు పబ్‌లలో దొరికారు..ఇంకొకరు ఇంట్లో ఉన్నారు. ముందు మీ కుటుంబానికి భరోసా ఇవ్వాలని ఘాటుగా స్పందించారు. నాటకాలు ఆపాలని హిత వు పలికారు. నాకు, నా కుటుంబసభ్యులకు ఏమి జరిగినా తన ఇంటికి తన కుమార్తెను పంపించవద్దంటూ అత్తింటికి విజ్ఞప్తి చేశారు. అమ్మ నువ్వు కూడా వస్తానని అనకు అంటూ కూతురిని కోరారు. ముద్రగడ కూతురుగా పరిచయం చేయకండి… అత్తింటి వారి పేరు వాడాలని హితవుపలికారు.