యువత అన్ని రంగాల్లో ముందుండాలి

ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 

రావులపాలెం, మహానాడు: యువత అన్ని రంగాలలో ముందుండాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా కేంద్రంలో జరిగిన బ్యూటీషియన్ శిక్షణా పత్రాల ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….

భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రావులపాలెం సత్యసాయి సేవా కేంద్రంలో వృత్తి శిక్షణ విభాగంలో 40 రోజుల పాటు జరిగిన బ్యూటీషియన్ కోర్స్ ముగింపు సందర్భంగా సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ సత్యసాయిబాబా వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులని, వారు అవతరించినప్పుడు మనం కూడా పుట్టడం మన అదృష్టమని, వారు స్థాపించిన సంస్థలు ప్రపంచానికి ఆదర్శనీయమని, కోట్లాదిమంది మంది బాబా వారి బోధనలకు పరివర్తన చెంది ప్రేమ సేవ ద్వారా  జీవితాలు ధన్యం చేసుకుంటున్నారన్నారు.  రావులపాలెం సత్యసాయి సేవా కేంద్రంలో వృత్తి శిక్షణ, విద్య, వైద్య, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను కొనియాడారు.

ఈ సందర్భంగా స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చిన ట్రైనర్ సాధనాల వీరమణిని నూతన వస్త్రాలతో , శాలువతో సత్కరించారు. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు అడబాల కొండబాబు శిక్షణ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొవ్వూరి వివేకానంద రెడ్డి, సమితి కన్వీనర్ కొవ్వూరి బ్రహ్మారెడ్డి, జిల్లా ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్త అడపా రాంబాబు, స్థానిక గ్రామ పెద్దలు గుత్తుల పట్టాభి రామయ్య, బొంతు రాంబాబు, గుత్తుల రాంబాబు, వెలగల శ్రీనివాసరెడ్డి, మండవల్లి నగేష్, కోట వెంకటేశ్వరరావు, నందం సూరిబాబు, సాయి సేవాదళ్ సభ్యులు నడింపల్లి రామకృష్ణంరాజు, ఎస్ వి ఎస్ రెడ్డి, చిర్ల వెంకటరెడ్డి, సిద్దిరెడ్డి రామకృష్ణ, చెక్క ప్రకాష్, చింతలపూడి రామభద్రరావు, మన్యం వర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.