వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా….

– మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి

మంగళగిరి, మహానాడు: కార్యకర్తలకు ఎప్పుడు నేను అండగా ఉంటానని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలని, నాయకుల్ని ఇబ్బంది పెడుతుందని కేసులు పెట్టారని భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తల కోసం ఎక్కడ వరకైనా నేను వస్తా.. ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డులో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో భారీగా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి నియోజవర్గ ఇన్‌ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి(డీవీఆర్‌) మాట్లాడారు. ఈ దిగజారుడు ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేయటమే కాక మిగతా పార్టీ వారిని కూడా ఇబ్బంది పెడుతుందని కేసులకు పెడితే ఎవరో భయపడొద్దు నేను అండగా ఉంటాను. త్వరలో జిల్లాస్థాయి, పట్టణ, రూరల్ పరిధిలో వార్డు, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి సంస్థాగతంగా బలోపేతం చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పార్టీ మీ అందరికీ అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే ప్రజల్లో వ్యతిరేకత భావన వచ్చిందని ఎలక్షన్ ఏ క్షణంలో పెట్టిన గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పార్టీకి సంబంధించిన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తెలియపరచమని కోరగా కార్యకర్తలు కొందరు మాట్లాడుతూ పార్టీలో ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్ ఇవ్వాలని, అబద్ధపు కేసులు పెట్టినా కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ మండల సభ్యులు మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, మంగళగిరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునగాల మల్లేశ్వరరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సంకె సునీత, గుంటూరు జిల్లా కార్యదర్శి మల్లవరపు సుధారాణి, మైనార్టీ జిల్లా నాయకులు షేక్ మహబూబ్, మాజీ కౌన్సిలర్ కలకోటి స్వరూప రాణి, మాజీ కౌన్సిలర్ నాలి వెంకటకృష్ణ, సీనియర్ పార్టీ నాయకులు దామర్ల కుబేర స్వామి, తదితరులు పాల్గొన్నారు.