ఆ బ్యానర్ పేరు పద్మాలయ కాని అసలు పేరు సాహసాలయ.. ఎన్ని ప్రయోగాలు.. ఎన్నెన్ని విజయాలు.. తెలుగు చిత్రసీమలో అన్ని రికార్డులూ ఆ సంస్థవే.. టాలీవుడ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన నిర్మాత.. తెలుగు బైస్కోపుకి సినిమా స్కోపు హంగులద్ది సెవెంటీ ఎం ఎం సొబగులు సైతం సమకూర్చిన ధీశాలి సూపర్ స్టార్ కృష్ణ.. సాహసాల తృష్ణ! మెకన్నాస్ గోల్డ్ మూవీ చూసి ఇలాంటి ఓ సినిమా మన దేశంలో […]
Read Moreసూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు కృష్ణ మృతి వార్త తెలుసుకొని నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి వెళ్లి కృష్ణ పార్ధీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత గా ఎనలేని […]
Read Moreసూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు
-బండి సంజయ్ కుమార్ ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి) గారు నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావుతో నిన్నటి రోజున ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇంతలోపే కృష్ణ గారు మరణించారన్న వార్త విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతి చెందాను. అనేక తెలుగు చిత్రాలలో సమాజాన్ని తట్టి లేపే విధంగా, ప్రజలను […]
Read Moreనమ్మిన ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడ్డ హీరో
-సాహసానికే ఊపిరి ఘట్టమనేని కృష్ణ -కంభంపాటి రామ్మోహన్ రావు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ పరిశ్రమలో ఆయనలేని లోటు పూడ్చలేనిది.. నటనలో, వ్యక్తిత్వంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగులో తొలి పూర్తి నిడివి కలర్, సినిమాస్కోప్, 70ఎంఎం సినిమాల స్రష్ట. నమ్మిన ఆదర్మాలకు జీవితాంతం కట్టుబడ్డ వ్యక్తి. వందలాది సినిమాలతో లక్షలాది సినీ కార్మికులకు ఉపాధి కల్పించిన ధన్యజీవి. నటుడిగా, సినీ నిర్మాతగా, స్టూడియో […]
Read Moreకళామతల్లి ముద్దుబిడ్డ ఘట్టమనేని కృష్ణ
-నందమూరి బాలకృష్ణ సంతాపం నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ.. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి. వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు తీర్చలేనిది.. సూపర్ స్టార్ కృష్ణగారి మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. […]
Read Moreకృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి […]
Read Moreనడిచే సంచలనం కృష్ణ!
భారతీయ సినిమా మరో ధ్రువతారను కోల్పోయింది.. తెలుగు చలనచిత్రసీమ నుంచి ఒక మహావ్యక్తి తిరిగిరాని తీరాలకు తరలి వెళ్ళిపోయారు. నటనే ప్రాణంగా..మంచితనమే ఆభరణంగా..సాహసాలే ఊపిరిగా..ప్రయోగాలే నైజంగా సినిమా రంగంతో యాభై ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని పెన వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు..తెలుగు ప్రజలు తమ ఇంట్లో మనిషి వెళ్లిపోయినంతగా శోకసముద్రంలోమునిగిపోయారు.. సూపర్ స్టార్ కృష్ణ.. పేరుకు ముందు హీరో అనే పదాన్ని అలంకారంగా పొదుగుకున్న ఏకైక నాయకుడు.. […]
Read Moreతెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది
ఘట్టమనేని కృష్ణ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం అమరావతి : తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా, విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ […]
Read Moreఅభీమానులూ ఇక సెలవు
-దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు -‘సూపర్‌స్టార్’ కృష్ణ ఇకలేరు హైదరాబాద్: ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని […]
Read Moreసూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: జి.కిషన్ రెడ్డి
తెలుగు వెండితెర ‘కౌబాయ్’, సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కృష్ణ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఐదున్నర దశాబ్దాలపాటు టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. తెలుగు సినిమాతెరపై ‘జేమ్స్ బాండ్’ జోనర్ ను పరిచయంచేసి, తెలుగు సినీ చరిత్రలో సాంకేతికకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేసి.. తెలుగు చిత్రపరిశ్రమ ‘సింహాసనం’ను […]
Read More