బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ . ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఐదు గంటలుగా కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె సెల్ ఫోన్లకు కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత గత పదేళ్లలో ఆర్థిక లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు. కవిత లీగల్ టీమ్ ఆమె నివాసం వద్దకు వచ్చినప్పటికీ… […]
Read Moreనకిలీ పట్టాలతో ప్రజలను మోసగించేందుకు కొడాలి నాని ప్రయ
– ఎన్నికల అనంతరం దుర్మార్గుడిని వేటాడి అక్రమాలకు తగిన గుణపాఠం – దొంగ పట్టాల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఉద్యోగి వినీత్ కు గుణపాఠం తప్పదు – జగనన్న కాలనీలో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు హెచ్చరిక జగనన్న కాలనీ భూముల్లో, పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇచ్చే ప్రయత్నాలు, ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్నాడు. దొంగ సంతకాలతో పట్టాలు పంపిణీ చేసేందుకు […]
Read Moreమానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్
-194 దేశాల జాబితాలో భారత్ 134వ స్థానం -భారత్ విలువ 0.633 నుంచి 0.644కి -మనిషి ఆయుర్దాయం 67.2 ఏళ్ల నుంచి 67.7కి -జాతీయ ఆదాయం 6,542 డాలర్ల నుంచి 6,951 డాలర్లకు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిలో భారత్ 134వ స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి గాను గురువారం పలు దేశాల ర్యాంకులను ఐరాసా విడుదల చేసింది. ఇందులో భారత్ విలువ 0.633 నుంచి 0.644కి పెరిగిందని తెలిపింది. దీంతో […]
Read Moreపది పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
– అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష అమరావతి: పది పరీక్షల నేపథ్యంలో భద్రతా చర్యలపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. అక్రమాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఈసారి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించింది. అధికారులు సైతం ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది.
Read Moreకమిషనర్ల నియామకాన్ని నిలిపివేయలేం
సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నిరాకరించింది. కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే కోసం కొత్తగా పిటీషన్ దాఖలు చేయాలని, మౌఖికంగా కోరితే పరిశీలించలేమని చెప్పింది. తదుపరి విచారణకు ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.
Read Moreఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు
రానున్న పార్లమెంటు, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. వాటిని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏయే రాష్టాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ప్రకటించింది. కాగా శనివారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమేరకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఫేజ్ 1, ఏప్రిల్ 11 91 సీట్లు, 20 రాష్ట్రాలు A.P. (మొత్తం 25), అరుణాచల్ ప్రదేశ్ (2), అస్సాం (5), […]
Read Moreకూటమి సభకు ‘ప్రజాగళం’ ఖరారు
ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి భారీ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతుండడంతో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఉమ్మడి సభకు ‘ప్రజాగళం’ అనే పేరు ఖరారు చేశారు. ఈ మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధాని మోదీ పాల్గొంటున్న సభను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా […]
Read Moreరోజాకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం
-వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి మంత్రి రోజాకు సొంత పార్టీ నుంచే ఎదురుగాలి వీస్తోంది. రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక వైసీపీ నేతలే పార్టీని డిమాండ్ చేసే స్థాయిలో నగరిలో ఆమెపై వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో, తిరుపతి ప్రెస్ క్లబ్ లో వైసీపీ అసంతృప్త నేతలు సమావేశమయ్యారు. వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నగరిలో తాము ఐక్యంగా లేమని, అసంతృప్తితో […]
Read Moreబీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు దాదాపు గంట సేపటి నుంచి సోదాలు జరుపుతున్నారు. గత 10 ఏళ్ల నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు కవితతో పాటు, ఆమె సహచరులు అందరి మొబైల్ ఫోన్లను అధికారులు […]
Read Moreఆ పార్టీ పునాదులు వివేకా,కోడికత్తి రక్తంతో తడిచి ఉన్నాయి
వైఎస్ సునీతా రెడ్డి తన తండ్రి వైఎస్ వివేకా జీవితాంతం వైఎస్సార్ కోసమే పని చేశారని, ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారని వివేకా కూతురు సునీత తెలిపారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని ఆలోచించేవారని… అలాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా మనకు దూరమై ఐదేళ్లు గడిచిపోయిందని… హంతకులకు ఇంత వరకు శిక్ష పడలేదని అన్నారు. కడపలో జరిగిన వివేకా సంస్మరణ సభలో మాట్లాడుతూ […]
Read More