చంద్రబాబు సమక్షంలో చేరిక పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు న్యూస్: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలేంరాజు ఆదివారం టీడీపీలో చేరారు. సత్తెనపల్లిలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన గతంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలలో కూడా పనిచేశారు.
Read Moreటీడీపీలో చేరిన విద్యావేత్త పారా లక్ష్మయ్య
వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కొత్త జడ్డవారిపాలెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ పారా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన ఢల్లీ, హైదరాబాద్, డెహ్రుడూన్, విజయవాడ, తిరుపతి, వినుకొండలో ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహిస్తూ ఎంతో మందిని కేంద్ర సర్వీసులలో ఎంపికయ్యేందుకు కృషిచేశారు.
Read Moreసీఎం జగన్‌కు సీఈసీ నోటీసు
– 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి కేంద్ర ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ‘మేము సిద్ధం’ బస్సు యాత్రతో జగన్ చేస్తున్న ప్రచారం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు, […]
Read Moreపాత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి గత వైభవం
-మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం -బైక్ మెకానిక్ లకు ఆధునాతన వాహనాలపై శిక్షణ -బైక్ మెకానిక్ లు, ఇసుక కార్మికులతో నారా లోకేష్ భేటీ ఉండవల్లి: రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుచేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక […]
Read Moreమొబైల్ చార్జింగ్ పాయింట్లను వాడొద్దు
-బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులతో జ్యూస్ జాకింగ్ ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిక -ఫోన్లలో మాల్‌వేర్లు చొప్పించి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని వార్నింగ్ -చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచన (శివ శంకర్. చలువాది) రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల వంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉండే మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్రం దేశ ప్రజలను తాజాగా హెచ్చరించింది. […]
Read Moreఉప్పు తింటే తప్పే
స్వానుభవంతో చెబుతున్నా. రాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి అయోజైజ్డ్ సన్నఉప్పును 20/- పెట్టి.. కొని రోగాలు తెచ్చుకోకండి. మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా, వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు. అప్పట్లో బీపీలు లేవు, వోంట్లో ఎముకల నొప్పులు లేవు. థైరాయిడ్ సమస్యల్లేవు… మీకు గుర్తుందా..? ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు […]
Read Moreముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఓడించండి
-పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ -ప్రకాశం కలెక్టరేట్ ఎదుట సర్పంచుల సంఘం ధర్నా -కేంద్ర, రాష్ట్ర నిధులు బకాయిలతో జమచేయాలని డిమాండ్ ఒంగోలు, మహానాడు: జగన్ ఓడితేనే స్థానిక సంస్థలకు మనుగడ ఉంటుందని, లేకుంటే పల్లెలు నాశనం అవు తాయని పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంధ్రప్ర దేశ్ పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన సర్పంచుల ధర్నాలో ఆంధ్రప్రదేశ్ […]
Read Moreపేపర్లలో ప్రకటనలు తప్ప…చేసింది శూన్యం
కేంద్ర పథకాలనే వైసీపీ చెప్పుకుంటోంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విజయవాడ, మహానాడు: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అసలు ఏమి చేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల సంక్షేమం అబద్ధాలు ప్రచారం చేసుకోవటం కోసం పేపర్ల ప్రకటనల కోసం ఖర్చు చేయటం తప్ప […]
Read Moreటీడీపీ గెలుపుతో సమస్యల పరిష్కారం
పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు న్యూస్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పొన్నూరు 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయులు ప్రచారం నిర్వహించారు. సూపర్ 6లోని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ వివరిం చారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండేళ్ల నుంచి పెన్షన్లు ఆపేశారని, అడిగితే […]
Read Moreవైసీపీకే ఓటు వేయాలని వాలంటీర్ బెదిరింపులు
-ససేమిరా అనటంతో దాడి..ఇద్దరికి తీవ్రగాయాలు -స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు: టీడీపీకి ఓటు వేయొద్దని, వైసీపీకి వేయాలని ఎస్సీ కుటుంబాలను వాలంటీర్ బెదిరించి దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో శనివారం రాత్రి జరిగింది. పెదకోదమగుండ్ల పంచాయతీ పరిధిలోని కాకానివారిపాలెంలో ఎస్సీ కుటుంబాలను బెదిరించిన అదే సామాజిక వర్గానికి చెందిన వాలంటీర్ వంగల సాగర్ వైసీపీకే తప్పనిసరిగా […]
Read More