ఐదురోజులు వర్షాలే.. హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్య మహారాష్ట్ర దగ్గర ఆవర్తనం కేంద్రీకృతమైందని, దీని వల్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. […]
Read Moreనగరంలో రేపు రంజాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. వివరాలు ఇలా ఉన్నా యి. మీరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే […]
Read Moreపుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ కలకలం
-ఐదుగురు యువకుల అరెస్ట్ -మరో ఘటనలో గంజాయి స్వాధీనం హైదరాబాద్, మహానాడు: నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సనత్ నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్ర నగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి బుధవారం సీజ్ చేశారు. నాలుగు గ్రాముల ఎండీఎంఏ, ఐదు గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ఫ్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పుట్టిన రోజు పార్టీలో యువకులు డ్రగ్స్ వినియోగించి మత్తులో మునిగారు. గోవా నుంచి వీటిని కొనుగోలు […]
Read Moreజనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతోపాటు, అంబటి రాయుడు (క్రికెటర్), నృత్య దర్శకుడు జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వి, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు.
Read Moreరూ.2,500 కోట్లు ఎటు వెళ్లాయి..రేవంత్‌రెడ్డీ?
-బీసీల వ్యతిరేకి కాంగ్రెస్‌ను బొందపెట్టాలి -బీఆర్‌ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ హైదరాబాద్, మహానాడు: సీఎం రేవంత్‌రెడ్డి గల్లీలో పేదలకు డబ్బులు పంచకుండా ఢల్లీలో రాహులకు పంచు తున్నాడని బీఆర్‌ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2500 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇప్పుడు డబ్బులు ఎవరి చేతులోకి వెళ్లాయో చెప్పాలని కోరారు. రాష్ట్ర […]
Read Moreకడప హోంగార్డులను బదిలీ చేయండి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు విజయవాడ, మహానాడు: కడప జిల్లాలో 2019 తర్వాత నియమితులైన హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని టీడీపీ శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్ సెక్యూరిటీగా ఉన్న వారిని, పనిచేసిన వారిని కడప జిల్లాలో హోంగార్డులుగా నియమించారన్నారు. అధికారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, అలాగే […]
Read Moreకంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. పార్టీ కీలక నేతలు, స్థానిక నాయకులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నివేదిత అక్క లాస్య నందిత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సాయన్న పెద్ద […]
Read More106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి
-ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ హైదరాబాద్, మహానాడు: సిద్దిపేటలో రాజకీయ సమావేశంలో పాల్గొన్నారన్న నెపంతో 106 ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ విమర్శిచారు. తమ సమస్యలపై చర్చించుకోవడానికి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి వెళ్లి ఓటు వేయాలని కోరారని అన్నారు. దీనిని సహించలేని బీజేపీ, కాంగ్రెస్, పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం […]
Read Moreజగన్ పర్యటనలో అన్నీ అబద్ధాలే
-ఆసుపత్రులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం -వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా? -కూటమి విజయం తర్వాత అవినీతిపై విచారణ -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి విజయవాడ, మహానాడు: జగన్ మాటలు కోటలు దాటుతాయి…చేతలు గడప దాటవని, ఆయన పర్యటనలో అన్నీ అబద్ధాలే చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఎంతవరకు […]
Read More420 హామీలు అమలు చేయకుంటే వెంటపడతాం… వేటాడుతాం
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్షాలు ఉంటే తన జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలనే నినాదంతో మోదీ ముందుకు వెళుతున్నారని… ఆ భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధి ముఖ్యనేతలతో మేడిపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్న శ్రద్ధ […]
Read More