– ట్విట్టర్(ఎక్స్) లో కేటీఆర్ ఆరున్నర దశాబ్దాల పోరాటం.. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు.. వేల బలిదానాలు, త్యాగాలు.. బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు.. ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష.. ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది! ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది! పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం […]
Read Moreమే 23 నుండి పాలిసెట్ అడ్మిషన్ల ప్రారంభం
-జూన్ 7న సీట్ల కేటాయింపు, 10న తరగతుల ప్రారంభం -సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23వ తేదీ గురువారం నుండి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం విడుదల చేయటం జరుగుతుందన్నారు. అమరావతి లోని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ […]
Read Moreపారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలి
– పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి – అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా […]
Read Moreజూన్ 4 తర్వాత అమెరికాలో గూగుల్ పే నిలిపివేత
ప్రముఖ పేమెంట్స్ సంస్థ గూగుల్ పే జూన్ 4 నుంచి అమెరికాలో తన సేవలు నిలిపివేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్‌లో మాత్రమే పనిచేయనుందని తెలిపింది. కంపెనీ ప్రకారం వినియో గదారులందరూ గూగుల్ వాలెట్‌కు బదిలీ చేయబడతారని వెల్లడిరచింది. దీంతో గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు.
Read Moreచెప్పుల వ్యాపారుల ఇళ్లలో రూ.100 కోట్లు
విస్తుపోయిన ఐటీ అధికారులు ఆగ్రాలో 14 ప్రాంతాల్లో సోదాలు ఉత్తరప్రదేశ్ : చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు ఉత్తరప్రదేశ్ లో సోదాలు నిర్వహించారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో అధికారులు షాక్ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించగా కోట్ల కొద్దీ డబ్బును గుర్తించారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు […]
Read Moreచంద్రబాబు సీఎం కావాలని పూజలు
రాచకొండ లక్ష్మయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం గుంటూరు అభ్యర్థుల గెలుపు కోసం మొక్కులు గుంటూరు: చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ నగరం లోని 51వ డివిజన్‌లోని రాముల వారి సన్నిధిలో మంగళవారం టీడీపీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, 51 డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి పాల్గొన్నారు. ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్, […]
Read Moreఏబీపై మళ్లీ హైకోర్టుకు వెళ్లిన జగన్ సర్కారు
– అపీలుకు వెళ్లాలని జగన్ సర్కారు నిర్ణయం – క్యాట్ తీర్పును లెక్కచేయని వైనం – కోడ్ అమలులో ఉన్నా సీఎం ఎలా ఆదేశిస్తారు? – కోడ్ సమయంలో సీఎంకు ఫైలు ఎలా పంపిస్తారు? – అప్పుడే ఎందుకు అపీలుకు వెళ్లలేదు? – జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు నిర్ణయాలా? – ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ చేయించడమే జగన్ లక్ష్యం ( మార్తి సుబ్రహ్మణ్యం) అమరావతి: అనుకున్నదే జరుగుతోంది. సీనియర్ […]
Read Moreఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
లోయలో పడిన వ్యాన్..18 మంది మృతి తునికాకు సేకరణకు వెళ్లి వస్తుండగా ఘటన ఛతీస్‌గఢ్, మహానాడు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కవర్థ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ఆదివాసీలు మృతిచెందారు. తునికాకు సేకరణ కోసం వెళుతున్న ఆదివాసీలు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి 20 అడుగుల లోయ లో పడిరది. ఆ వాహనంలో 40 మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతు న్నారు. […]
Read Moreరాయదుర్గంలో ఎన్‌ఐఏ సోదాలు
అనంతపురం, మహానాడు : అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులో నివాసం ఉంటున్న అబ్దుల్ కుమారులు గత కొంతకాలంగా కనిపించకుండా పోయారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అధికా రులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నాగుల బావిలోని తండ్రి అబ్దుల్ ఇంటిని నిశితంగా పరిశీలించారు.
Read Moreజూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు
తెలంగాణ: తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే బుధవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ ఎస్.వాణికి జూడాల సంఘం నేతలు మంగళవా రం నోటీసులు అందజేశారు. స్టైఫండ్స్ ప్రతినెలా సమయానికి ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని, అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని, ఇతర డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతున్నారు.
Read More