ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు పర్యాయపదం

-అలుపెరుగని కృషీవలుడు రామోజీ రావు – తెదేపా జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి అలుపెరగని కృషి, పట్టుదల, అంకితభావం, ధృడదీక్ష, పోరాటపటిమ, ప్రజాస్వామ్య పరిరక్షణలకు రామోజీరావు పర్యాయపదం. వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం. తెలుగుభాష అభ్యున్నతికి ఎంతోగానో కృషిచేశారు. పాడుతా-తీయగా లాంటి కార్యక్రమాలతో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను వెలితీశారు. ప్రపంచంలోనే రెండవ స్థాయి కలిగిన ఫిల్మ్ సిటీని నిర్మించారు. మార్గదర్శి ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు నమ్మకమైన సేవలు […]

Read More

అక్షరయోధుడు రామోజీరావు

మాజీ శాసనమండలి సభ్యులు, సి. రామచంద్రయ్య ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత, అక్షరయోధుడు చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం నన్ను ఎంతో ఆవేదనకు, బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. రామోజీరావు గారు తెలుగు సమాజానికి, దేశానికి చేసిన సేవలు విస్తృతం, అనన్య సామాన్యం. ఓ దశలో రాష్ట్రంలో రాజకీయ విలువలు పతనం అవుతున్న దశలో రామోజీరావు గారు సాగించిన అక్షర యజ్ఞం, రాజీలేని పోరాటం తెలుగునాట […]

Read More

పత్రికారంగంలో కొత్త ఒరవడి సృష్టించారు

-సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దేశ పత్రికారంగంలోనే రామోజీరావు ఓ కొత్త ఒరవడి సృష్టించారని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగు పత్రికారంగంలో ఆయన ఓ మకుటం లేని మహారాజు అని అన్నారు. రాబోయే తరాల పత్రికా ప్రతినిధులకు ఓ మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. చిత్రసీమలోనూ అడుగుపెట్టి, ఉషోదయ సంస్థను విజయవంతంగా నడిపించారని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోను నిర్మించి దేశానికి గర్వకారణమయ్యారని […]

Read More

రామోజీరావు…తెలుగు నాట తొలి విజనరీ

– విక్రమ్‌ పూల ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం నాతోపాటు అందర్నీ ఆవేదనకు, బాధకు గురి చేస్తుంది. రామోజీరావు గారు తెలుగు సమాజానికి, దేశానికి చేసిన సేవలు విస్తృతం, అనన్య సామాన్యం. ఓ దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ విలువలు పతనం అవుతున్న దశలో రామోజీరావు గారు ఈనాడు ద్వారా సాగించిన అక్షర యజ్ఞం, రాజీలేని పోరాటం తెలుగునాట రాజకీయ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు […]

Read More

తెలంగాణ ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో రామోజీరావు అంత్య‌క్రియ‌లు

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మీడియా దిగ్గ‌జం రామోజీ రావు అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించాల‌ని తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం సీడ‌బ్ల్యూసీ స‌మావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ అక్క‌డి నుంచే రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అంత్య‌క్రియ‌ల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌నర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఓ మీడియా దిగ్గ‌జానికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో […]

Read More

రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్..

గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్ – దర్శకుడు శంకర్ పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ […]

Read More

రామోజీరావు మృతి పట్ల పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి..

రామోజీరావు మృతి పట్ల పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి.. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు.. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీ నిరూపించారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలి -పవన్‌ కల్యాణ్

Read More

దార్శనికుడు రామోజీరావు : మోదీ

రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు.భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సహకారం జర్నలిజం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందన్నారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మీడియా, వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమాణాలు నెలకొల్పారని […]

Read More