రూ.50 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు మూడు రాష్ట్రాలను పరిశీలిస్తున్న కేంద్ర సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో సానుకూల అంశాలపై పరిశీలన ప్రముఖ పత్రికలో కథనంపై నిరుద్యోగుల్లో ఆశలు అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వేళ రాష్ట్రానికి శుభవార్త అందుతోంది. రాష్ట్రంలో భారీ రిఫైనరీ ప్రాజెక్టు ప్రారంభానికి బీపీసీఎల్ పరిశీలి స్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోందని, […]
Read Moreఉత్తరాదిలో భగ్గుమంటున్న భానుడు
ప్రయాగ్‌రాజ్‌లో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు ఎండలతో మండి పోతున్నాయి.. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుడు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 17 వరకు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడిరచారు.
Read Moreసామాజిక సమతూకం, యువతరానికి పెద్దపీట
చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినుకొండ: అన్నివర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేసిన మంత్రివర్గ కూర్పు అద్భుతంగా కుదిరిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి మంత్రివర్గంలో ఏకంగా 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించడాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా అభివర్ణిం చా రు. అన్నిప్రాంతాలు, అన్ని జిల్లాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా […]
Read Moreసాగునీటి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ రూపొందించండి
ఆగిన చిన్నతరహా ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు భూములు గుర్తించండి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశం ఖమ్మంలో విద్య, సాగునీటి రంగాలపై సమీక్ష విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు మరో వంద పెంచనున్నట్లు వెల్లడి ఖమ్మం: కలెక్టర్ కార్యాలయంలో విద్య, సాగునీటి పారుదల శాఖల ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామిరెడ్డి, జిల్లా […]
Read Moreకువైట్ లో భారీ అగ్నిప్రమాదం.. 41మందికి పైగా మృతి
కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. మంటలు […]
Read Moreపార్టీ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్‌కు ఘన స్వాగతం
బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి,, ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ కు రాష్ట్ర కార్యాలయం లో ఘన స్వాగతం పలికారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఘనంగా సన్మానించారు. బిజెపి ఎమ్మెల్యే లు సైతం సత్య కుమార్ ను శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా […]
Read Moreభుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన కోర్టు
– ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టును కోరారు. దీంతో పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
Read Moreకొత్త రక్తంతో పాత తరానికి విశ్రాంతి?
– సీనియర్లకు ఇక విశ్రాంతేనా? – క్యాబినెట్‌పై లోకేష్ ముద్ర – లోకేష్‌కు లైన్ క్లియర్ చేసిన బాబు – సీనియర్లకు తప్పని నిరాశ – వైసీపీనుంచి వచ్చిన వారికి పదవులు – గతంలో మాదిరిగా నేతలను పిలిపించి మాట్లాడని బాబు – ఇకపై ఇదే సంప్రదాయం కొనసాగుతుందా? – టీడీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీలో సీనియర్లకు ఇక విశ్రాంతి ఇచ్చినట్లేనా?.. భవిష్యత్తులో వారు ఇక […]
Read Moreఇంతింతై..వటుడిరతై..నాలుగోసారి అంత ఎత్తయి…
చంద్రబాబు సుదీర్ఘ ప్రస్థానంలో విజయాలు 1975 యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రవేశం 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి గెలుపు 1995లో మొదటిసారి ఎన్టీఆర్ నుంచి పగ్గాలు జాతీయస్థాయి రాజకీయాల్లోనూ కీలక పాత్ర హైటెక్ సిటీ నిర్మాణంతో ప్రపంచస్థాయి గుర్తింపు ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రను పాలించిన ఏకైక సీఎం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అమరావతి: నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. సాధారణ రైతు కుటుంబంలో […]
Read Moreచిక్కీల కవర్లపై వైసీపీ రంగులు మారాయి!
అమరావతి: స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటివరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా కొత్త ప్రభుత్వం రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు. అలాగే వాటిపై ‘జగనన్న గోరు ముద్ద’ అని ఉండగా దానిని తొలగించారు. గురువారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీల తో పాటు కోడిగుడ్లు, రాగి పిండి సరఫరా చేయనున్నారు.
Read More