నిరుద్యోగుల కోసం చేసింది ఏమిటి?

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ […]

Read More

మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తా

– మంత్రి నారా లోకేష్‌ వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటా.ఈసారి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ట్రాలకు తీవ్రమైన పోటీ ఇస్తుంది.ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షించడానికి, రాష్ట్రం నుంచి వలస వెళ్లాల్సి వచ్చిన మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నేను 2019లో వదిలి పెట్టిన చోటు నుండే పనిని తిరిగి ప్రారంభిస్తా.

Read More

ఉల్లి రేటుకు రెక్కలు

దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులు పెరుగుతున్న ఉల్లి ధరలు.. కొనే ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.. దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్ర గామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు వంటి పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధరలు 30 […]

Read More

త..త..త..త.. హోంమంత్రి!

– సబిత, సుచరిత, వనిత, అనితకు పట్టం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఒక్కోసారి కాకతాళీయంగా జరిగే కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్రమైన అనుభవమిది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుత ప్రయోగం చేశారు. దివంగత ఇంద్రారెడ్డి భార్య సబితకు హోంమంత్రి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే ఒక మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన తొలి […]

Read More

వెల్కమ్ చీఫ్: మంచు మనోజ్

జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పలుశాఖలకు మంత్రి కావడంపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశారు. ‘మెరుగైన సమాజం కోసం మీ నిర్విరామ అంకితభావం, నిబద్ధతకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి.ప్రొడక్టివ్, ఎఫెక్టివ్ పాలన రావాలని కోరుకుంటున్నా. వెల్కమ్ చీఫ్’ అని ట్వీట్ చేశారు.

Read More

సీఎం ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ‌దాం

– ప్ర‌భుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేద్దాం – రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిప‌ర‌చి దేశంలోనే అగ్ర‌గామి రాష్ట్రంగా నిల‌పాల‌న్న ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డంతో పాటు ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌తి ఒక్క‌రికీ చేరువ చేయ‌డంలో స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ స‌ఫ‌లీకృత‌మ‌య్యేలా అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాలు; […]

Read More

వ్యయసాయాభివృద్దికి పాటుపడతా

-రైతన్నలకు అండగా నిలుస్తా -రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించిన బాబుకి కృతజ్ఞతలు – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్నతలు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు నాకు అప్పగించిన బాధ్యతను అంతఃకరణ శుద్దితో నిర్వహించి ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, […]

Read More

జర్మనీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వేడుకలు

జర్మనీ: జర్మనీలోని ఫ్రాంక్‌ఫార్ట్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలన వధించినందుకు గాను జర్మనీలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ…. “ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు టీడీపీ విజయ కోసం ఎనలేని కృషి చేశారు. […]

Read More

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కిషన్‌రెడ్డి భేటీ

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా గురువారం కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే తో కలిసి,రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను గౌరవప్రదంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రి […]

Read More

రైతు పొలంలో ప్లెక్సీల పై తుమ్మల నాగేశ్వరరావు ఆరా

కామారెడ్డి జిల్లా, లింగంపేట గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఒక రైతు పొలంలో ప్లెక్సీలు కట్టడంపై గౌరవ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరాతీశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ, సదరు రైతుకు 2010లో దీర్ఘకాలిక రుణం మంజూరు చేశామని, గడువు 9 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అనేక సార్లు కలిసి రుణాన్ని చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేసామని, బ్యాంకుకు తనాఖా […]

Read More