రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ నీ, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న […]
Read Moreక్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాగాయలంకలో ఉచిత క్యాన్సర్, గుండె మెగా వైద్య శిబిరం ఏపీలోనూ బసవ తారకం క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు నందమూరి బాలకృష్ణ యోచన క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తొలి దశలోనే పరీక్షలు చేయించి వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం నాగాయలంకలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సుదర్శి మానవతా […]
Read Moreఆగస్టు 16న మాదిగల కృతజ్ఞతా యాత్ర
కర్నూలు, మహానాడు : ఎస్సీ వర్గీకరణకు అండగా ఉండటమే కాకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు అని ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆగస్టు 16న హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞతా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగల కృతజ్ఞతా యాత్ర పోస్టర్ ను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేంపార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు […]
Read Moreమానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తే చూస్తూ ఊరుకోం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావుతో కలిసి పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా […]
Read Moreవయనాడ్‌లో ఘోరప్రమాదం
వయనాడ్, మహానాడు : వయనాడ్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 24 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. | కొండచరియలు విరిగిపడి చురల్‌మలా గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియలు పడి 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. వరద నీటిలో మృతదేహాలు కొట్టుకు వస్తున్న దృశ్యం అక్కడి పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఘటనాస్థలికి వెళ్లే రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు […]
Read Moreకొమురంభీమ్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి
– శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు హైదరాబాద్, మహానాడు : నిధులు కేటాయించని పక్షంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి అని శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సాగునీటి రంగం, సివిల్ సప్లైస్ పై జరిగిన పద్దుల చర్చ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు […]
Read Moreఆరేళ్లలో ఒక్క రూపాయి జీతం పెంచలేదు
-ఏండియూ ఆపరేటర్ కంటే తక్కువ వేతనాలు -కూటమి ప్రభుత్వమైనా మా కష్టాలు తీర్చాలి -గ్రామ రెవెన్యూ సహాయకులు బొప్పరాజు, గరికపాటి బ్రహ్మయ్య అమరావతి, మహానాడు : దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో పని చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు గత ప్రభుత్వ హయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, గత ఆరు సంవ్సరాలుగా జీతం ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం […]
Read Moreమారు వేషంలో ఏసీబీ అధికారులు…
-అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు -ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో వెళ్లారు అనంతపురం, మహానాడు : అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు జరిగాయి. యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మార్కెట్ యార్డులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించారు. వివరాల్లోకి వెళితే… అనంతపురం మార్కెట్ యార్డ్ కు ముగ్గురు వ్యక్తులు లుంగీ, పాత చొక్కా, మెడలో తువ్వాలుతో […]
Read Moreగూడూరులో కిడ్నాప్ కలకలం..
-నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేసిన దుండగులు -సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్న పోలీసులు కర్నూలు, మహానాడు : కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. అయితే సినీఫక్కీలో కిడ్నాపర్లను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎమ్మిగనూరు రహదారిలో ఉన్న దుకాణాలు అద్దెకు కావాలంటూ కారులో యజమాని వెంకటేష్ ను […]
Read Moreహైదరాబాద్ లో దారుణం..
లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఓ యువతిని.. పార్టీ పేరుతో హోటల్ కు తీసుకెళ్లిన స్నేహితులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిటీకి చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. ఇటీవల పార్టీ ఉందని చెప్పి ఆమెను స్నేహితులు ఓ హోటల్ […]
Read More