మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్

హైద‌రాబాద్: బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి మంత్రి కోమటిరెడ్డి […]

Read More

నా పాస్‌పోర్టు నాకు ఇప్పించండి

– హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ అమరావతి: గతంలో తనపై విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్టు వెనక్కి ఇప్పించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ కుమారుడు సింగపూర్‌లో ఉన్నత విద్యకు వెళుతున్నారని, తండ్రిగా పిటిషనర్ కూడా వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో పాస్‌పోర్టు విడుదలకు ఆదేశాలు […]

Read More

వర్గీకరణ ప్రారంభమయ్యేవరకూ జాబ్ నోటిఫికేషన్లు వద్దు

– కూటమి సర్కారుకు మందకృష్ణ మాదిగ వినతి గుంటూరు: ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యే వరకూ ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ, సీఎం చంద్రబాబునాయుడును కోరారు. ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలును వేగవంతం చేయాలని కోరారు. నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని మంత్రి నారా లోకేశ్ చెప్పారని, అందుకే ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యే వరకూ ఎటువంటి నోటిఫికేషన్ […]

Read More

ఇండోనేషియాలో యాపిల్ ఐఫోన్ 16పై నిషేధం

– ఇతర దేశాల్లో కొనుగోలు చేసినా తమ దేశంలో వాడడంపైనా నిషేధం ఇండోనేషియా: యాపిల్‌కు షాక్ ఇస్తూ ఇండోనేషియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేదం విధించింది. తమ దేశంలో ఈ ఫోన్ విక్రయాలు, వినియోగంపై ఆంక్షలు పెట్టింది. ఇతర దేశాల్లో కొనుగోలు చేసినా, తమ దేశంలో వాడడంపైనా నిషేధం విధించింది. ఇండోనేషియాలో యాపిల్ ఐఫోన్ 16 వాడటానికి ఐఎంఈఐ […]

Read More

ఏపీలో డిసెంబర్‌ నుంచి రిజిస్ట్రేషన్లు మరింత భారం?

– రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కసరత్తు మొదలు అమరావతి, మహానాడు: ఏపీలో డిసెంబరు 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు మరింత భారం కానున్నట్టు తెలుస్తోంది. ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గడచిన రెండు నెలలుగా జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నివేదికను సీఎం ఆమోదిస్తే […]

Read More

ఏఐ అవకాశాల వినియోగంతో శరవేగంగా ఏపీ అభివృద్ధి

– ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తున్నాం – పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి! – శాన్ ఫ్రాస్సిస్కో పారిశ్రామికవేత్తల సమావేశంలో మంత్రి లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో: వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి […]

Read More

మెయిన్ డ్రాకి అర్హత సాధించిన శాన్వీ లట్టాల

– అండర్-13 ఆల్ ఇండియా సబ్ జూ. ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హైదరాబాద్‌: అసోంలోని డిబ్రూగఢ్‌లో జరుగుతున్న అండర్-13 ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 పోటీల్లో స్థానిక మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారిణి శాన్వి లట్టాల అద్భుతమైన ఆటతో మెయిన్ డ్రా కి అర్హత సాధించింది. చివరి రౌండ్ లో అసోం క్రీడాకారిణి తనిస్క్ గొనవర్ పై వరుస సెట్స్ లో 15/11,15/13 […]

Read More

పాపాగ్నిలో.. ఇసుకాసుర తాండవం

– ట్రాక్టర్ అతివేగానికి రైతు కుటుంబం బలి – స్పాట్ లో కొడుకు దుర్మరణం.. తెగిపడిన తండ్రి కాలు (బహదూర్) ఇసుకాసురుల స్వైర విహారానికి ఓ రైతు కుటుంబం తల్లడిల్లింది. ఇసుక అక్రమ రవాణాలోని ఓ ట్రాక్టర్ తనయుడిని మింగేస్తే.. తండ్రి కాలును ఛిద్రం చేసింది. ఈ దయనీయ ఘటన కడప జిల్లా పులివెందులలో ఉదయం చోటు చేసుకుంది. మొయిళ్ళ చెరువుకు చెందిన రైతులు తండ్రి కొడుకు పని నిమిత్తం […]

Read More

ఎలక్ట్రీషియన్ల సేవల కోసం ఊర్జవీర్ స్కీమ్

అమరావతి: రాష్ట్రంలోని 1.2లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీం’ కింద వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను వీరి సాయంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో వీరి సేవలను వినియోగించు కుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read More

తిరుపతి పోలీసులకు బాంబు తిప్పలు

– తిరుపతిలో బాంబు బెదిరింపుల పరంపర – రాజు పార్కు కు ఫోన్ కాల్ బెదిరింపు – అలిపిరి పోలీసులు అప్రమత్తం – డాగ్ బాంబు స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలోని పెద్దపెద్ద హోటళ్లకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల బెడద తప్పటం లేదు. దీంతో తిరుపతి పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని […]

Read More