మహేష్ బాబు కూతురు ఏమోషనల్ పోస్ట్ ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా”
Read Moreపెన్నుల తయారీ సంస్థ రొటోమాక్ పై సీబీఐ కేసు నమోదు
ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రొటోమాక్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును రూ. 750 కోట్ల మేర మోసం చేసిందని రొటోమాక్ పై అభియోగాలను నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు సాధన కొఠారి, రాహుల్ కొఠారిలై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 420 (చీటింగ్) కింద అభియోగాలు మోపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియం నుంచి ఈ […]
Read Moreశాస్త్రీయత లోపించిన చదువులు
మన సమాజం అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ వివేచన చాలా అవసరం. పాఠశాల స్థాయిలోనే యువ మేధస్సులను ఉత్తేజపరిచి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి తద్వారా ప్రతి పాఠశాల నూతన ఆవిష్కరణల వేదికగా రూపొందించాల్సిన ఆవశ్యకత నేటి సాంకేతిక యుగంలో ఎంతైనా ఉంది. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న ప్రయోగశాలలు సంప్రదాయ పాఠ్యాంశాలకు అనుగుణంగా రూపొందించినవే కాని ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మాత్రం లేవు, చాలా పాఠశాలల్లో ప్రయోగశాలలే లేవు […]
Read Moreఆ అయిదుగురు..
రామారావు (44 యేళ్ళ కెరీరు – 300 సినిమాలు) నాగేశ్వర్రావు (72 యేళ్ళ కెరీరు; 255 సినిమాలు) శోభన్ బాబు (37 యేళ్ళలో 230 సినిమాలు) కృష్ణంరాజు (55 యేళ్ళు; 190 సినిమాలు) కృష్ణ (50 యేళ్ళు; 350 సినిమాలు) అయిదుగురూ కలిసి 200 యేళ్ళకు పైగా యాక్టివ్ క్యుములేటివ్ కెరీరు, 1325 సినిమాలు.. అంటే యావరేజిన యేడాదికి ఆరు సినిమాలు.. అంటే రోజూ రెండు షిఫ్టులు పనిచేస్తే కానీ […]
Read Moreసాహసాల శపథం.. విజయాల పథం..!
ఆ బ్యానర్ పేరు పద్మాలయ కాని అసలు పేరు సాహసాలయ.. ఎన్ని ప్రయోగాలు.. ఎన్నెన్ని విజయాలు.. తెలుగు చిత్రసీమలో అన్ని రికార్డులూ ఆ సంస్థవే.. టాలీవుడ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన నిర్మాత.. తెలుగు బైస్కోపుకి సినిమా స్కోపు హంగులద్ది సెవెంటీ ఎం ఎం సొబగులు సైతం సమకూర్చిన ధీశాలి సూపర్ స్టార్ కృష్ణ.. సాహసాల తృష్ణ! మెకన్నాస్ గోల్డ్ మూవీ చూసి ఇలాంటి ఓ సినిమా మన దేశంలో […]
Read Moreసూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు కృష్ణ మృతి వార్త తెలుసుకొని నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి వెళ్లి కృష్ణ పార్ధీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత గా ఎనలేని […]
Read Moreసూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు
-బండి సంజయ్ కుమార్ ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి) గారు నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావుతో నిన్నటి రోజున ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇంతలోపే కృష్ణ గారు మరణించారన్న వార్త విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతి చెందాను. అనేక తెలుగు చిత్రాలలో సమాజాన్ని తట్టి లేపే విధంగా, ప్రజలను […]
Read Moreనమ్మిన ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడ్డ హీరో
-సాహసానికే ఊపిరి ఘట్టమనేని కృష్ణ -కంభంపాటి రామ్మోహన్ రావు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ పరిశ్రమలో ఆయనలేని లోటు పూడ్చలేనిది.. నటనలో, వ్యక్తిత్వంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగులో తొలి పూర్తి నిడివి కలర్, సినిమాస్కోప్, 70ఎంఎం సినిమాల స్రష్ట. నమ్మిన ఆదర్మాలకు జీవితాంతం కట్టుబడ్డ వ్యక్తి. వందలాది సినిమాలతో లక్షలాది సినీ కార్మికులకు ఉపాధి కల్పించిన ధన్యజీవి. నటుడిగా, సినీ నిర్మాతగా, స్టూడియో […]
Read Moreకళామతల్లి ముద్దుబిడ్డ ఘట్టమనేని కృష్ణ
-నందమూరి బాలకృష్ణ సంతాపం నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ.. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి. వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు తీర్చలేనిది.. సూపర్ స్టార్ కృష్ణగారి మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. […]
Read Moreకృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి […]
Read More