సల్మాన్ ఖాన్ కు గన్ లైసెన్స్ మంజూరు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు తుపాకీ లైసెన్స్ మంజూరైంది. సల్మాన్ కు గ్యాంగ్ స్టర్ గ్రూపుల నుంచి ముప్పు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని, గన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ సల్మాన్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఇదే విషయమై జులై 22న ముంబై పోలీసు కమిషనర్ ను కలుసుకున్నాడు. ఏ ఆయుధానికి లైసెన్స్ ఇచ్చారన్నది తెలియలేదు. ఒక వ్యక్తి రక్షణ కోసం […]

Read More

సీనియర్ కమెడియన్ కేజే సారథి కన్నుమూత

ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఎన్నో చిత్రాలలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కేజే సారథి ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నెల రోజుల నుంచి హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి రాత్రి 2.32 గంటలకు ఆయన మృతి చెందారు. కేజే సారథి […]

Read More

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..

-మాదాపూర్‌లో ఈ తెల్లవారుజామున ఘటన -కారులో వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు -పాయింట్ బ్లాంక్‌లో మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ తెల్లవారుజామున కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై మాదాపూర్ నీరూస్ సిగ్నల్ వద్ద బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని ముజీబ్‌గా గుర్తించారు. పాయింట్ బ్లాంక్‌లో మొత్తం ఆరు […]

Read More

శరత్ కాలం..

ఓ రకం పాత్రలకు పెట్టింది పేరు.. జగ్గయ్య టైపు… మనిషేమో అందగాడు.. హీరోయిన్లను ప్రియులకు అప్పజెప్పేసే త్యాగధనుడు బాలచందర్ బడి నుంచి వచ్చిన మరో విద్యార్థి అప్పుడప్పుడు హీరోలకు ప్రత్యర్థి.. వెండితెరపై శరత్ కాలం.. రమాప్రభతో మాత్రం సాగలేదు కలకాలం..! సత్యంబాబు దీక్షిత్.. శరత్ బాబుగా మారి మొదట్లో ఆకట్టుకొలేకపోయాడు కించిత్.. రామాలయంలో సావిత్రి చెంప దెబ్బకు తేరుకుని బాలచందర్ నీడకు చేరుకుని అప్పుడయ్యాడు మంచి నటుడు ఆప్తుడయ్యాడు అందరికీ […]

Read More

నేటి నుండి తెలుగు సినిమా షూటింగులు బంద్

– నిర్మాత దిల్ రాజు ఆగస్టు 1వ తేదీ నుంచి తెలుగు సినిమా షూటింగులు ఆపివేయాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంది.తాజాగా జరిగిన జనరల్ బాడీ మీటింగులో నిర్మాతలు అందరూ కలసి నేటి ( ఆగస్టు 1) నుంచి సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. రన్నింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ లు కుడా జరగవు. అన్నీ సమస్యలను పరిష్కరించాలని […]

Read More

వెండి తెరపై విలన్..నిజ జీవితంలో హీరో

వెండి తెరపై విలన్.. నిజ జీవితంలో హీరో.. మానవత్వానికి బ్రాండ్ అంబాసిడర్.. శిబి..బలి..కర్ణ.. ఈ పాత్రలకు ప్యాంటు షర్టు రూపం ఆ ముగ్గురి ప్రతిరూపం.. దాతృత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్.. మోంగ్ లో పుట్టిన మొనగాడు ఈ రోజున భారతీయతకే చిరునామా.. సోనూ సూద్.. ఇప్పుడు ఇంటింటి సబ్జెక్ట్… మిస్టర్ పెర్ఫెక్ట్..! అతడులో ముద్దుగుమ్మడు నందూకి దెబ్బకొడితే పోకిరోడు మల్లిగాడని తిట్టుకున్న జనం… అరుంధతిలో వదల బొమ్మాళీ అన్న పశుపతిని […]

Read More

నాయక్ నహీ..ఖల్నాయక్ హూ మై..!

చోళీ కే పీచే క్యా హై.. చున్రీ కే నీచే క్యా హై.. ఆ సంగతి ఏమో కాని ఈ ఖల్నాయక్ కే పీచే బహుత్ బడా కహానీ హై.. కిస్మత్ కీ క’హాని’..! ఇండియాకే అమ్మ మదరిండియా ఈ సంజయ్ దత్తును కన్న అమ్మ.. నాన్న దత్తుడు ధీరోదాత్తుడు.. ఆపై ఉదాత్తుడు.. మరి అలాంటి జంట కడుపు పంట.. ఎలా అయ్యాడో ఉన్మత్తుడు.. మాదకద్రవ్యాల మత్తుడు.. చపలచిత్తుడు! అమ్మకి..నాన్నకి […]

Read More

థియేటర్ కు వచ్చే ప్రేక్షకులకు విరక్తి పుట్టించారు: నిర్మాత అశ్వనీదత్ ధ్వజం

ప్రస్తుతం సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర పరిస్థితులపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని అన్నారు. కొందరు సీఎంలతో మాట్లాడి టికెట్ రేట్లు పెంచుకున్నారని అన్నారు. అసలు ఈ రేట్లు పెరగకముందే ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారని వివరించారు. కొందరు గొలుసుకట్టు థియేటర్లను తీసుకుని వాళ్లే సమోసాలు, కూల్ డ్రింకులు అమ్ముకుంటూ, రేట్లు భారీగా […]

Read More

తిరుపతిలో ఇప్పుడు జరగని పాపం అంటూ లేదు: సినీ నిర్మాత అశ్వనీదత్

-వైసీపీ మూడేళ్ల పాలనతో తిరుపతిని సర్వనాశనం చేసిందన్న అశ్వనీదత్ -అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని వ్యాఖ్య -చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందన్న అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఆయన విమర్శించారు. తిరుపతిలో జరిగే అన్యాయాలను ఊహింలేమని, ఇప్పుడు […]

Read More

‘బింబిసార’ ట్రైలర్ లాంచ్!

కల్యాణ్ రామ్ హీరోగా .. ఆయన సొంత బ్యానర్లో ‘బింబిసార’ సినిమా నిర్మితమైంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు. అటు ‘బింబిసార’ కాలంలోను .. ఇటు వర్తమానంలోను ఈ కథ నడుస్తుంది. రెండు డిఫరెంట్ లుక్స్ తో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వెలువడింది. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. అటు […]

Read More