పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజా వేదికలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషిచేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దళిత, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Read Moreగంజాయి, డ్రగ్స్ కావాలా…అభివృద్ధి కావాలా?
-మహిళలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి -ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే భవిష్యత్తు -చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం -నంద్యాల నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి నంద్యాల, మహానాడు: గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీ 34వ వార్డులో కార్యకర్త అబ్దుల్ రహీమ్ కుటుంబాన్ని ఆమె పరామర్శిం చారు. […]
Read Moreఆస్కార్‌లో దీపిక
ఆస్కార్ కమిటీల్లో భారతీయ ప్రతిభావంతుల పేర్లు ఇంతకుముందు వెల్లడయ్యాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2023లో సంస్థలో చేరడానికి 398 మంది ప్రముఖ కళాకారులు ఎగ్జిక్యూటివ్ లకు ఆహ్వానాలు పంపగా టాలీవుడ్ సంగీతదర్శకుడు ఎం.ఎం.కీరవాణి-పాటల రచయిత చంద్రబోస్.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సహా ఆర్టిస్టుల కేటగిరీ నుంచి రామ్ చరణ్- ఎన్టీఆర్ లకు ఈ జాబితాలో చోటు లభించింది. సాంకేతిక నిపుణుల్లో కీరవాణి-బోస్- సెంథిల్ పేర్లు […]
Read Moreజగన్ సింగిల్ గా కాదు శవాలతో వస్తాడు!
ప్రతి ఎన్నికకు సింగిల్ గా వస్తానని చెబుతున్న జగన్, ప్రతిసారి శవాలతో వస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014లో తండ్రి శవాన్ని వాడుకున్నారు, 2019లో బాబాయి శవాన్ని వాడుకున్నారు, ఇప్పుడు పెన్షనర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. “జగన్ రెడ్డి గొప్ప నటుడు. 2019లో బాబాయిని లేపేశాడు, ఇప్పుడు పెన్షన్ పేరుతో వృద్ధులను చంపేందుకు సిద్ధపడ్డాడు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో […]
Read Moreమాస్ దర్శకులంతా వెంటపడుతున్నారు
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అలాగే ఆయన నటించే ప్రతీ సినిమా వరుస సక్సెస్ లు అందుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ఆయన కెరియర్ లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని జోరు మీద ఉన్నారు. బాలయ్యను ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందనేది దర్శకులకి ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ […]
Read Moreఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
ఏపీ సార్వత్రిక ఎన్నికలపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, విజ్ఞాపనలను తమకు నేరుగా అందచేయొచ్చని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు నేరుగా సచివాలయంలో అందచేయాలని తెలిపారు. కార్యాలయ పని […]
Read More‘సారంగదరియా’ ఇన్‌స్పిరేషనల్ సాంగ్
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఎం. ఎబెనెజర్ పాల్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా నుంచి శుక్రవారం మేకర్స్ ‘అందుకోవా…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. […]
Read Moreజనం తిరుగుబాట్లు, చీవాట్లు కనిపిస్తున్నాయా జగన్?
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -వినుకొండ 21వ డివిజన్‌లో ఇంటింటా ప్రచారం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: మేమంతా సిద్ధమంటూ మరోసారి అబద్ధాల యుద్ధానికి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రజల నుంచి తిరుగుబాట్లు, చీవాట్లు కనిపిస్తున్నాయా అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు ప్రశ్నించారు. సాక్షాత్ ముఖ్యమంత్రికి ఈ దుస్థితి ఉంటే ఇక గల్లీల్లో తిరిగే ఎమ్మెల్యే బొల్లా లాంటి వారి పరిస్థితి తలుచుకుంటునే […]
Read Moreపవర్‌ఫుల్ శ్రీవల్లిగా రష్మిక
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. అయితే పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీవల్లిగా […]
Read Moreప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం
పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్ పల్నాడు, మహానాడు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నూతన ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పనిచేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. […]
Read More