-జిల్లా ఎన్నికల అధికారికి ఓటర్ల ఫిర్యాదు -పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు: షేక్ పేట్‌లో ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. పేట్ డివిజన్‌లో దాదాపు 3 వేల ఓట్లను డిలీట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారు. అయితే ఇప్పుడు తొలగించారని చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరే కంగా అధికారులు ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే తొలగించారని […]
Read Moreకర్రలు, రాడ్లతో అంబటి రాంబాబు అల్లుడి దౌర్జన్యం
-పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ శ్రేణులపై బూతులు -నా కొడుకులను తన్ని తరిమేయాలని పోలీసులకు హుకుం -తరిమికొట్టిన టీడీపీ శ్రేణులు..ఊరి నుంచి పరార్ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ చౌదరి ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామంలో సోమవారం పోలింగ్ సందర్భంగా హల్‌చల్ చేశాడు. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రెచ్చిపోయాడు. నా కొడకల్లారా ఎవర్రా మీరు? ఇక్కడ మీ […]
Read Moreదర్శిలో వైసీపీ అరాచకాలపై దేవినేని ఉమ లేఖ
అమరావతి, మహానాడు: దర్శి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. బొట్లపాలెం, ఎర్రబోయినపల్లె, తుమ్మపాడు గ్రామాల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను తమ ఆదీనంలోకి తీసుకుని ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదు చేశారు. దర్శి నియోజకవర్గానికి అదనపు బలగాలు పంపి శాంతియు […]
Read Moreదర్శి ఎమ్మెల్యే అభ్యర్థిపై కత్తులతో దాడి యత్నం
పోలింగ్ బూత్ సమీపంలో వైసీపీ గూండాల అరాచకం ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు దర్శి, మహానాడు: దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై వైసీపీ గూండాలు కత్తులతో దాడికి యత్నించారు. రెండురోజుల క్రితం టీడీపీ కార్యకర్త సుబ్బును కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎన్నికల సందర్భంగా ఓటమి భయంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇదే గ్రామంలో మరో ఇద్దరిని కొట్టి గాయపరిచారు. అయితే […]
Read Moreఓటు వేసిన జి.వి.ఆంజనేయులు దంపతులు
వినుకొండ: పోలింగ్ కేంద్రాల దగ్గర సోమవారం ఉదయం 6.30 నుంచే ఓటర్లు బారులు తీరారు. ఎండలు మండుతుండటంతో ముందుగానే ఓటు వేసి వెళ్లేందుకు క్యూలు కట్టారు. వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు దంపతులు వినుకొండ పోలింగ్ కేంద్రం లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read Moreపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన చదలవాడ అరవిందబాబు
నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఎన్జీవో హోమ్‌లో ఎన్నికల కేంద్రాన్ని సోమవారం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పరిశీలించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ విజ్ఞతతో ఓటువేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే ప్రజలందరూ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Moreటీవీ 5 రిపోర్టర్‌పై వైసీపీ శ్రేణుల దాడి
-తీవ్రగాయాలు..ఆసుపత్రికి తరలింపు -పల్నాడు జిల్లాలో ఘటన గురజాల, మహానాడు: పల్నాడు జిల్లా మాచవరం మండలంలో ఎన్నికల వేళ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం ఓటు వేసి వెళుతున్న టీవీ 5 రిపోర్టర్ రవీంద్రపై దాడికి పాల్పడ్డారు. రవీంద్ర తన భార్యతో కలిసి ఓటు వేసి వెళుతుండగా ముసుగులు వేసుకుని వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచారు. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read Moreఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. ఏపీలోని పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని దుండగులు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు. పోలింగ్ […]
Read Moreఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో కుటుంబసభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓటు వేశారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరి వల్ల […]
Read Moreఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భార్యతో కలిసి వచ్చారు. జనసేనాని రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. పవన్ ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు.
Read More