సజ్జలపై పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

మంగళగిరి : కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్‌ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించారు. దాంతో టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More

జూన్‌ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు!

తెలంగాణ : టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్‌ రెండో వారంలో చేపట్టా లని ప్రభుత్వం భావిస్తోంది. పెండిరగ్‌లో ఉన్న పండిట్‌, పీఈటీలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్‌ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 60 వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్‌ అయ్యే అవకాశం ఉంది. టెట్‌ అర్హతతో సంబంధం లేకుండానే పదోన్న తులు కల్పించాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.

Read More

రేపటి నుంచి వాహనదారులకు కొత్త రూల్స్‌

ఢిల్లీ :  జూన్‌ 1 నుంచి దేశంలో కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. రేపటి నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్డీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కు అర్హత సాధించవచ్చు. ఇక మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబ డితే రూ.25 వేల వరకు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు..ఆధార్‌ కార్డు ఫ్రీ అప్డేట్‌ గడువు జూన్‌ 14తో ముగియనుంది.

Read More

హైదరాబాద్‌ నటిపై అత్యాచారం!

తమిళనాడు: నటిపై ఆమె డ్రైవర్‌, మరో ముగ్గురు అత్యాచారం చేసిన దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సహాయ నటిపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read More

ఇక దివ్యాంగులు, వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శనం

తిరుమల: దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌కు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేం దుకు అనుమతించనుంది. అయితే వృద్ధులు, దివ్యాంగుల స్లాట్‌ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకురావొచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

Read More

తెలుగుదేశం, జనసేన పెద్దలకు విజ్ఞప్తి!

కేంద్రంలో రైల్వే శాఖను తప్పనిసరిగా తీసుకోవాలి కేంద్ర సంస్థలు, కార్యాలయాలు ఏర్పాటు చేయించాలి అమరావతి నగర నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి ఐకానిక్‌ బ్రిడ్జి, ప్రజావేదిక నిర్మాణం చేయించాలి ఆరునెలల పాటు హామీల అమలును వాయిదా వేయండి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయించాలి కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడినా అది తెలుగుదేశం, జనసేనల సహకారం లేనిదే సాధ్యంకాని రీతిలో ఫలితాలు రాబోతున్నాయి..కాబట్టి తెలుగుదేశం, జనసే న పెద్దలకు విజ్ఞప్తి. […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్లపై అంత భయమెందుకు?

వాస్తవాలు దాచి సీఈవోపై అసత్య ప్రచారాలా? కౌంటింగ్‌లో మీ కుటిల ప్రయత్నాలు ఫలించవు కేసును విడి చాలెంజ్‌ అన్నప్పుడే డొల్లతనం బయటపడిరది వైసీపీ నేతలపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫైర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శం లో ఆయన […]

Read More

గాంధీపై మోదీ వ్యాఖ్యలకు నిరంజన్‌రెడ్డి స్పందన

ప్రధాని ఒక అజ్ఞాని..తనకు తెలిసిందే ప్రపంచమంటారు కొత్తగా గాంధీని పరిచయం చేస్తున్నారని వ్యాఖ్యలు హైదరాబాద్‌: గాంధీ సినిమా 1982లో వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. మహాత్ముడిని కొత్తగా ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమకు తెలిసిందే ప్రపంచం అన్న సంకుచితులు, అజ్ఞానులు ఈ రోజు దేశానికి మార్గదర్శకులని మండిపడ్డారు. […]

Read More

సందీప్‌ కిషన్‌ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్ z’

సందీప్‌ కిషన్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రాజెక్ట్ z’ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ నిర్మించారు. ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠతతో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు నటన, యూనిక్ కథ, కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టాప్ […]

Read More

నిరాశలో మాళవికమోహనన్‌

కోలీవుడ్ లో పాపుల‌రైన మాళవిక మోహనన్ రాజా సాబ్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. బ‌హుభాష‌ల్లో రాణించాల‌ని త‌ప‌న ప‌డుతోంది ఈ బ్యూటీ. ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ మేకర్ మజిద్ మజిదీ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ `బియాండ్ ది క్లౌడ్స్` (2017)లో త‌న అద్భుత‌ నటనతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన మాళ‌విక ఇటీవ‌ల క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టిస్తోంది. ఫిలింఫేర్ ఉత్త‌మ డెబ్యూ అవార్డు స‌హా స్టార్ స్క్రీన్ […]

Read More