ఇక మనదే హైదరాబాద్!

( వెంకట్) హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి ఈ రోజు తెర పడింది.. తెలంగాణ, ఏపీగా ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది.. ఈ గడువు ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది.. విభజన చట్టం లోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో […]

Read More

పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే

-పెనం మీదనుండి పొయ్యిలోకి.. -బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది -అవినీతితో రాజ్యమేలుతూ తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మార్చింది -6 గ్యారంటీలుసహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది -ఏ వర్గం ప్రజలను కదిలించినా ఆశాంతి, ఆగ్రహమే కన్పిస్తోంది -ఉద్యమ ఆకాంక్షల అమలుకు మరో పోరుకు బీజేపీ సిద్ధం -ఆశీర్వదించి అండగా నిలవాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర […]

Read More

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు సంవత్సరాలు పొడిగించాలి

-ఆస్తులు, నీళ్లు పరిష్కారం తూతూమంత్రంగా -విద్యావకాశాలు, ఉపాధి కోల్పోతున్న యువత -10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ లాంటి నగరం నిర్మించలేని రాష్ట్ర ప్రభుత్వాలు -అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలి -మాజీ మంత్రి డా.సాకే శైలజానాథ్ డిమాండ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం నేటితో ముగియునున్న సందర్భంలో మాజీ పీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా […]

Read More

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘జాతీయ ప్రగతికి రాష్ట్రం చేసిన సహకారం పట్ల ప్రతి భారతీయుడు గర్వ పడుతున్నారు.. ఈ రాష్ట్రానికి గొప్ప చరిత్ర, శక్తిమంతమైన సంస్కృతి ఆశీర్వాదం ఉన్నాయి. రాబోయే కాలంలో రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Read More

తెలంగాణ ఉన్నత శిఖరాలకు చేరాలి

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం హైదరాబాద్ లో హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “భిన్న సంస్కృతులను, భిన్న ప్రాంతాల ప్రజలతో మినీ భారత్ లాగా విలసిల్లే తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి, సౌబ్రాతృత్వానికి గొప్ప ప్రతీక.. భారత అభివృద్ధి పయనంలో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా […]

Read More

వైకాపా ధనంజయ రెడ్డిని కరేపాకును చేసిందా?

జగనుకు కళ్లు, చెవులు లాగా పనిచేసిన ఆయన కార్యదర్శి ధనంజయ రెడ్డి గారి రిటైర్మెంట్ నిన్న. ఆయన రిటర్మెంట్ సభలో ఏ అధికారులు పాల్గొన్నారో & ఎంత ఘనంగా వీడ్కోలు పలికారో చూద్దామని సాక్షిని తిరగేస్తే.. అందులో అధికారుల పేర్లు లేవు. ఫోటో చూస్తే శ్రీలక్షి వున్నట్లుగా మసక మసకగా కనిపించింది సాక్షి పత్రికలో. సాక్షి వెబ్‌సైటులో వెతికా డిజిటల్ ఫోటోలో క్లారిటీ వుంటుంది అని. గంట సేపు వెతికినా […]

Read More

బాబు లేఖతోనే తెలంగాణ

– తెలంగాణలో బడుగులకు గొడుగు పట్టిన ఘనత టీడీపీదే – పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దుతో బీసీ,ఎస్పీలకు స్వేచ్ఛ – బీసీలకు రాజకీయ జన్మనిచ్చిన ఘనత టీడీపీదే – తెలంగాణ టీడీపీ ఆఫీసులో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం ఆదివారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామభూపాల్‌ రెడ్డి మొదట జాతీయ […]

Read More

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో మరో ట్విస్ట్.. పరారీలో తల్లి భవానీ

లైంగిక దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రజ్వల్‌ను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన సిట్.. ఆయన తల్లి భవానీ రేవణ్ణకు నోటీసులు జారీచేసింది. ఇంటి వద్దే ఉండాలని, విచారణకు తమ సహకరించాలని సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. కానీ, ఆమె ఇంట్లో లేరని, పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైంగిక దాడి, కిడ్నాప్ కేసుల్లో ప్రజ్వల్‌తో […]

Read More

‘పనికిరాని చర్చ, సమయం వృధా…’, ఎగ్జిట్ పోల్‌పై స్పందించిన ప్రశాంత్ కిషోర్

ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన తర్వాత, ఎన్నికల వ్యూహకర్త, విశ్లేషకుడు, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజల సమయాన్ని వృధా చేశాయన్నారు. ఇది పనికిరాని చర్చ అంటూ మీడియాను కూడా టార్గెట్ చేశాడు. అదే సమయంలో, ప్రశాంత్ కిషోర్, ఎన్నికలు ముగిసిన తర్వాత, రాజకీయాల విషయానికి వస్తే, బూటకపు జర్నలిస్టులు, మతోన్మాద రాజకీయ […]

Read More

అరుణాచల్ ప్రదేశ్‌లో దూసుకెళ్తున్న బీజేపీ.. సిక్కిం పీఠం మరోసారి క్రాంతికారీ మోర్చాదే!

ఢిల్లీ: సిక్కింలో అధికారంలో ఉన్న క్రాంతికారీ మోర్చా సిక్కింలో క్లీన్ స్వీప్ అంచున ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. భారత ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 60 స్థానాలకు గాను 17 స్థానాలను గెలుచుకుంది. అంతకుముందు 10 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపొందింది. ప్రస్తుతం 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిక్కింలో  ఏడు స్థానాలను గెలుచుకుంది. 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. […]

Read More