5 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించిన యువగళం

-అరాచకపాలనపై సమరశంఖం పూరించిన యువగళం జైత్రయాత్ర -కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ భరోసానిచ్చిన యువనేత లోకేష్‌ -226 రోజుల్లో 3132 కి.మీ సాగిన యువగళం పాదయాత్ర అమరావతి: జగన్మోహన్‌ రెడ్డి అవినీతి, అరాచక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు యువనేత లోకేష్‌ చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభమైన యువగళం పాద […]

Read More

తాత మహానాయకుడు…తండ్రి దార్శనికుడు

వారి పేరు నిలిపేలా రాజకీయాల్లో సంచలనాలు ప్రజల మనిషిగా ఎదిగిన యువతేజం నారా లోకేష్‌ తాత నినాదం..నాన్న విధానం పుణికిపుచ్చుకున్న నేత మంగళగిరి: ఎండైనా, వానైనా, చలైనా, వడగాలైనా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్రతో పల్లెపల్లెకూ చేరారు నారా లోకేష్‌. ప్రజల మనిషిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు […]

Read More

ముచ్చటగా.. మూడోసారి!

హ్యాట్రిక్ వీరులు! ( మార్తి సుబ్రహ్మణ్యం) తాజా ఎన్నికల్లో అనేక అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఎదురులేదని నిరూపించుకున్నారు. శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు, హిందూపురంలో హీరో బాలకృష్ణ , టెక్కలిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఇచ్చాపురంలో బెందాళం అశోక్, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, అద్దంకిలో గొట్టిపాటి రవి, పర్చూరులో ఏలూరు సాంబశివరావు, విజయవాడ […]

Read More

పులివెందులలో జగన్‌ విజయం..తగ్గిన మెజార్టీ

అమరావతి:  వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందులలో 59 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2019తో పోలిస్తే భారీగా మెజార్టీ తగ్గింది. అప్పు డు 90,110 మెజార్టీ రాగా ఇప్పుడు 30 వేల ఓట్లు తగ్గిపోయాయి. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌ రెడ్డి ఓడిపోయినా భారీగా ఓట్లను కొల్లగొట్టారు.

Read More

లీస్ట్‌ ఆళ్ల…హయ్యస్ట్‌ రికార్డ్‌ నారా లోకేష్‌

మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల చరిత్రలో అతి తక్కువ మెజారిటీతో గెలిచింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల రామకృ ష్ణారెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై 12 ఓట్ల తేడాతో గెలిచారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన […]

Read More

జగన్‌కు ఫోన్‌ లేదట..జనం దగ్గర లోకేష్‌ నెంబర్‌!

వైసీపీ అధినేతకు కాల్స్‌ అతిపెద్ద మిస్టరీ ట్రాన్స్‌పరేన్సీకి పెట్టింది పేరు లోకేష్‌ లక్షల మందికి ఫోన్‌ నెంబర్‌ అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత జగన్‌ రెడ్డి తనకు ఫోన్‌ లేదు.. నెంబరూ లేదని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చారు. ఫోన్‌ లేని వాడికి బాబాయ్‌ మర్డర్‌ కాల్‌ వేకువనే ఎలా వచ్చిందో సీబీఐ దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. నెంబర్‌ లేని జగన్‌…సీఎంగా […]

Read More

ఇక కోర్టు బోనులో జగన్

– సీఎంగా హాజరు నుంచి మినహాయింపు – జగన్ ఈసారి కోర్టుకు హాజరుకాక తప్పదు ( మార్తి సుబ్రహ్మణ్యం) మాజీ ముఖ్యమంత్రిగా మారిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఇక సినిమా కష్టాలు మొదలుకానున్నాయి. ఇప్పటివరకూ అక్రమాస్తుల కేసులో, బెయిల్‌పై బయట ఉన్న జగన్.. సీఎం కావడంతో సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో.. ప్రతి శుక్రవారం హైదరాబాద్‌కు వస్తే ట్రాఫిక్ సమస్యలతోపాటు, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని వాదించారు. దానికితోడు […]

Read More

మంగళగిరికి తొలి యువ ఎమ్మెల్యేగా నారా లోకేష్‌

– 72 ఏళ్ల నియోజకవర్గ చరిత్రలో రికార్డ్‌ మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇప్పటివరకూ ఎన్నికైన ఎమ్మెల్యేలలో అతి పిన్న వయస్కుడు నారా లోకేష్‌. 1952లో ఏర్పడిన మంగళగిరి నియోజక వర్గం నుంచి 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 12వ ఎమ్మెల్యేగా ఎన్నికైన లోకేష్‌ వయసు 41 సంవత్సరాలు. 1952 నుంచి 2024 వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా కొందరు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ లెక్కన […]

Read More

ఫలితాల తర్వాత పత్తా లేని వేణుస్వామి

– జగన్ గెలుస్తాడని చెప్పిన జ్యోతిష పండితుడు వేణుస్వామి – కేసీఆర్ గెలుస్తాడని చెప్పింది ఈ ముఖమేనంటూ సెటైర్లు – ఇక తాను సినిమా, రాజకీయ జోస్యం చెప్పనంటూ దయతలచిన స్వామి ( మార్తి సుబ్రహ్మణ్యం) వేణుస్వామి గుర్తున్నాడా? అదేనండీ.. యూట్యూబుల్లో చిన్న గడ్డం వేసుకుని, పెద్ద కళ్లజోడుతో కనిపిస్తాడు చూడండి. ఆయనే. ‘‘ఈ ఎన్నికల్లో జగన్ ఖాయంగా గెలుస్తాడు. ఆయనకు భాగ్యస్థానంలో గురువున్నాడు. రాజయోగస్థానంలో రాజ్యాధికారం ఇచ్చే స్ధానంలో […]

Read More

చివరి మీడియా భేటీలో ఏడ్చినంత పనిచేసిన జగన్

– అవును.. అంతా మీ వల్లే! – ఆ ఓట్లన్నీ ఏమయ్యాయో తెలియదన్న ఆవేదన – ఏడుపు దిగమింగుకుని మరీ ప్రసంగం – మీడియాకు ప్రశ్నలు వేయనివ్వకుండా జంప్ – ఆఖరి రోజునా అదే అహంకారం ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్.. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. లెక్కలేని తనానికి పరాకాష్ఠ. ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్నా తగ్గని అహంభావం మరోసారి ఆవిష్కృతమయింది. ఫలితాల రోజున జగన్ మీడియాతో మాట్లాడతారని ఆహ్వానం […]

Read More