చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఇక అన్నీ మంచిరోజులే

-నిజం గెలవాలిలో నాడు ప్రజల బాధలు చూశాను -నేడు రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషాన్ని చూశాను -కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుతుంది – పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలను ట్వీట్ చేసిన నారా భువనేశ్వరి నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను…బాధలు విన్నాను…ఇబ్బందులు తెలుసుకున్నాను. అణచివేతను అర్థం చేసుకున్నాను. నేను […]

Read More

గృహనిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష

-గృహానిర్మాణాలు సకాలంలో పూర్తి చేయటానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి -గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఆదేశం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న గృహాలను సకాలంలో పూర్తి చేయటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర, సంభందాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌర, సంభందాల శాఖ మంత్రి గా ఇటీవల భాద్యతలు స్వీకరించిన మంత్రి పార్ధసారధి మంగళవారం […]

Read More

తొలిసారి బాబు చాంబర్‌కు పవన్

-బాబుతో పవన్ భేటీ – ఆలింగనం చేసుకున్న బాబు-పవన్ అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు […]

Read More

పాఠశాలలు మూలపడటానికి కారణం ప్రవీణ్

-ప్రవీణ్ ప్రకాశ్, ప్రతాప్ రెడ్డి, రామలింగంను తొలగించాలి -విద్యాశాఖ మంత్రికి, టీచర్లకు మధ్య బ్రోకర్లా రామలింగం – మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అమరావతి: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఎసీసీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్య సచివాలయంలో జేడీ సర్వీసెస్గా పని చేస్తున్న రామలింగంను వెంటనే ఆ స్థానాలను నుంచి తప్పించాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ […]

Read More

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించండి

-ఆశా వర్కర్లకు జీతాలివ్వరా? – తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి కోఠీలో ఉన్న ఆరోగ్య విభాగం వద్ద ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వారికి ప్రతి నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఆశా వర్కర్లకు న్యాయం చేస్తామని ఆశా వర్కర్ల అధికారి పద్మజ ధర్నా వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించడం జరిగింది. జాయింట్ […]

Read More

ప్రజల కష్టాలను గుర్తించి పరిష్కరించినపుడే ఎమ్మెల్యేగా గెలిచినట్లు

-తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి -నకరికల్లు మండలంలోని మంచినీటి చెరువును అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నట్లు ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.ఈ మేరకు నకరికల్లు మండలం నకరికల్లు,శాంతినగర్ వద్దనున్న మంచినీటి చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని పరిష్కరించే వరకు తప్పకుండా శ్రమిస్తానన్నారు.అధికారులు కూడా […]

Read More

తెలంగాణ రాష్ట్రమొచ్చినంక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు

-బీఆర్ఎస్ పాలనలో ఏనాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు -కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు -విద్యుత్ ఉద్యోగుల జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి -ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ -గత బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన వైఖరితో మసకబారిన ఆర్టిజన్ల జీవితాలు -అంధకారంలో మగ్గిపోతున్న 22 వేల మంది విద్యుత్ కార్మికుల కుటుంబాలు -విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బిజెపి డిమాండ్ – బిజెపి తెలంగాణ రాష్ట్ర […]

Read More

రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తా

-పారిశ్రామిక వేత్తను ప్రోత్సాహిస్తా -వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకుని వస్తా – ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రి గా పదవీ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో భూపతిరాజు శ్రీనివాస వర్మ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాపై ఉంచిన భాద్యతలును వమ్ము కాకుండా నిర్వర్తిస్తా.నేను ఈ స్థాయికి రావడానికి జాతీయ, రాష్ట్ర నేతలు చాలా మంది సహకరించారు. కేంద్ర మంత్రి స్థాయిలోకి తీసుకుని వచ్చి న నాయకులకు ధన్యవాదాలు. రెండు […]

Read More

జగన్ వి రాజకీయ పరిపక్వత లేని మాటలు

-జగన్ స్పృహలో ఉండి మాట్లాడాలి -2019 లో కూడా ఇవే ఈవీఎంలు కదా? – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ వైసీపీ నాయకుల దిక్కుమాలిన ఆరోపణలు చూస్తుంటే నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అనే తెలుగు సామెత గుర్తు వస్తోంది. ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయాక, వైసీపీ పార్టీ రాజకీయ భవిష్యత్తు అంధకారం అవటంతో రాజకీయ పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారు. ఒక పక్క వైసీపీ ఎమ్మెల్యే […]

Read More

మీ వెంట నేనున్నాంటూ ”ప్రజాదర్బార్” లో లోకేష్ భరోసా

మంగళగిరి: మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కష్టాల్లో ప్రజలకు స్వాంతన కలిగిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్నిస్తూ మీకు అండగా నేనున్నానంటూ […]

Read More