– బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. చైర్మన్ నందమూరి బాలకృష్ణ మా అమ్మ గారు స్వర్గీయ బసవతారకం క్యాన్సర్ మహమ్మారి కారణంగా మరణించడంతో కలత చెందిన మా తండ్రి , మా కుటుంబంలో జరిగిన విషాదం మరో కుటుంబంలో జరగకూడని భావించి స్థాపించిన హాస్పిటల్ మా ఈ బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఆరోజు మా నాన్న మదిలో […]
Read Moreవైజాగ్ సినిమా రంగానికి ఒక సెంటిమెంట్ ప్రాంతం
-గంటా శ్రీనివాసరావు విశాఖలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో భీమిలి టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరా మీడియాతో మాట్లాడుతూ… వైజాగ్ నగరం సినిమా పరంగా ఒక సెంటిమెంట్ ప్రాంతం అని వెల్లడించారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా తమ సినిమాల్లో కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ తీసేవారని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న ఫిల్మ్ క్లబ్ తరహాలో, ఏపీలోనూ ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేయాలనుకుని… గతంలో తొట్లకొండపై […]
Read Moreఅందరం కలిసి ఈ సభను గౌరవ సభగా నడిపించుకుందాం
ఏపీ అసెంబ్లీ 16 వ స్పీకర్ గా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం మాట్లాడుతూ… అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరం అని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని అన్నారు. సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచించారు. శాసనసభ కార్యకలాపాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తారని, 16వ శాసనసభకు గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని స్పీకర్ హోదాలో అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. […]
Read Moreఅయ్యన్నకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు
“16వ శాసనసభ స్పీకర్ గా, మా ఉత్తరాంధ్ర నుంచి 5వ స్పీకర్ గా ఎన్నికైన మీకు ప్రజల తరఫున, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్యం వచ్చాక, పరిపాలన కొన్ని వర్గాలకే పరిమితమైన తరుణంలో… 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ అని టీడీపీ వ్యవస్థాపన […]
Read Moreఅయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపిన సత్యకుమార్
సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఉత్తరాంధ్ర ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు ఊపిరిగా నిలిచిన పెద్దలు చింతకాయల అయ్యన్న పాత్రుడు నేడు స్పీకర్ పదవిని అలంకరించడం సంతోషంగా ఉందంటూ ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తొలిసారి సభకు ఎన్నికైన తనలాంటి వారికి అయ్యన్న పాత్రుడు మార్గదర్శకత్వం చేయాలని కోరారు. సభాపతిగా ఆయన పేరును నామినేట్ చేసే అవకాశం కలగడం తన అదృష్టమని చెప్పారు. మొదటిసారి సభలో అడుగుపెట్టిన తనకు ప్రసంగించే అవకాశం […]
Read Moreఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు గురించి మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ…. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో కలిసి పనిచేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని లోకేశ్ అన్నారు. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు అని అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న అని తెలిపారు. వైసీపీ హయాంలో కక్షగట్టి అయ్యన్న ఇంటిని కూలగొట్టినా, కేసులు పెట్టినా తగ్గకుండా పోరాడారని కొనియాడారు. ఏడుసార్లు […]
Read Moreస్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
ఏపీ అసెంబ్లీ 16 వ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా సభలో అడుగుపెట్టిన తనలాంటి వారికి అధ్యక్ష స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవం మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. ఇన్నాళ్లూ అయ్యన్న వాడి వేడి చూసిన ప్రజలు ఇకపై ఆయన హుందాతనం చూస్తారని పేర్కొన్నారు. అయితే, ప్రత్యర్థులను తిట్టే అవకాశం గౌరవ స్పీకర్ పదవి కారణంగా […]
Read Moreఅయ్యన్నను స్పీకర్ గా చూడడం ఎంతో గర్వంగా ఉంది
అసెంబ్లీలో స్పీకర్ చింతకాయ అయ్యన్నపాత్రుడు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ….”అధ్యక్షా… తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ శాసనసభ్యుల్లో మీరు ఒకరు. బీసీ నేతగా ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మిమ్మల్ని సభలో ఎమ్మెల్యేల మధ్య చూశాం… ఇప్పుడు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. ఎంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. అందరి ఆమోదంతో, 16వ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు […]
Read Moreస్పీకర్ గా బాధ్యతలు స్పీకరించిన అయ్యన్న పాత్రుడు
అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి పదవికి అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. ఆయనను గౌరవంగా సభాపతి సీటు వద్దకు తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు సూచించారు. సభ్యుల అభినందనల మధ్య అయ్యన్న పాత్రుడు స్పీకర్ […]
Read Moreరైల్వే అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష
కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్ నిర్మాణాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని స్పందిస్తూ… గత ఐదేళ్లలో ఇక్కడి రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు అన్నారు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావన్న ఉద్దేశంతో జగన్ వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. గుంటూరు జిల్లాలో రైల్వే బ్రిడ్జిల పరిస్థితిపై అధికారులతో […]
Read More