యుద్ద ప్రాతిపదికన నీటిపారుదల ప్రాజక్టుల నిర్వహణ పనులు

•ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ఖరీఫ్ లో సివారు భూములకు సాగు నీరు అందజేస్తాం •పట్టిసీమ పంపులన్నింటినీ ఆపరేషన్ లోకి తీసుకువచ్చి రెండు మూడు రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేర్చుతాం •గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పులిచింతల ప్రాజక్టులో 0.5 టిఎంసి నీరు కూడా నిల్వలేకుండా పోయింది •గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజక్టుల గేట్లు కొట్టుకు పోయాయి రాష్ట్ర జలవనరుల […]

Read More

పాఠశాలలకు అందించే గుడ్లు, చిక్కీల్లో నాణ్యత ఉండాలి

• సమగ్ర శిక్షా ఎస్పీడీ మరియు ఎండీఎం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు – లోకేష్ ఆగ్రహంతో రంగంలోకి దిగిన అధికారులు విజ‌య‌వాడ: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలు నాణ్యత కూడినవి ఇవ్వాలని, పాడైనవి అందిస్తే తగు చర్యలు తీసుకోబడతాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు మరియు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు సరఫరాదారులను ఉద్దేశిస్తూ అన్నారు. శుక్రవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో […]

Read More

అప్పుల్లో కూరుకుపోయాం

ఆర్థికంగా ఆదుకోండి ఆర్థిక మంత్రి నిర్మలకు ఏపీ సీఎం వినతి   న్యూఢిల్లీ, మహానాడు :  గత ప్రభుత్వ నిర్ణయాలు, పనుల కారణంగా రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు. ఆర్థికంగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా.. వివిధ మంత్రులతో […]

Read More

తెలంగాణలో విద్యుత్ బిల్లుపై క్యూఆర్ కోడ్ 

హైదరాబాద్, మహానాడు :  దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసే విద్యుత్ బిల్లులపై ఇకపై క్యూఆర్ కోడ్ ను ముద్రించనున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ […]

Read More

జగన్ తీరే వేరబ్బ

* విధ్వంస కారులను పెంచి పోషించాడు • ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం * 25 లక్షలు పెట్టి జైల్లో ఖైదీని కలవడం సిగ్గుచేటు   * ప్రజలే జగన్ రెడ్డికి బుద్ధి చెప్పారు * ఇకనైనా మార్పు వస్తే బాగుండు * 2029 లో కూడా అధికారం టీడీపీ కూటమికే * టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు    మంగళగిరి, మహానాడు : బాబాయి చనిపోతే పట్టించుకోని జగన్ రెడ్డి… 25 లక్షలు ఖర్చుపెట్టి మాచర్లలో […]

Read More

బాబు..బాగా బిజీ!

– మోదీ, అమిత్‌షా, నిర్మల, పీయూష్, రాజ్‌నాధ్‌సింగ్, నద్దాతో భేటీ – రాష్ట్రానికి నిధులు రాబట్టడమే ఏకైక అజెండా – ముగిసిన బాబు ఢిల్లీ పర్యటన ( అన్వేష్) ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండురోజుల బాబు పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్,రాజ్‌నాధ్‌సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా, 16వ ఆర్ధిక సంఘం చైర్మన్ […]

Read More

ముద్దాయితో మరో ముద్దాయి మిలాఖత్ 

* సంఘ విద్రోహక శక్తిని మంచివాడు అనడం జగన్ రెడ్డికే చెల్లు! • మాచర్లలో అరాచకానికి పాల్పడిన ఏ2 ఎక్కడ?    * దళితుడు మణిక్యరావుపై దాడికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి • బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై దాడికి హత్యాయత్నం కేసు పెట్టాలి  * టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు :  జగన్ రెడ్డి ఒక అబద్దాల పుట్ట అని.. నోరు తెరిస్తే […]

Read More

ఎర్ర చందనంపై పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు అవాస్తవాలు

– విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దాదాపు రూ.4-5వేల కోట్లు విలువైన 8వేల టన్నుల పట్టుబడ్డ ఎర్రచందనం – పవన్‌కళ్యాణ్‌ తన పలుకుబడిని ఉపయోగించి దీన్ని రాష్ట్రానికి రప్పించడంపై దృష్టిపెట్టాలి – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపై పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ఆరోపణల ప్రకారం…. 2010 నుంచి జరిగిన అక్రమ రవాణాకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఇద్దరూ భాగస్వాములని అనవచ్చా? – వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తాడేపల్లి : 2010 […]

Read More

ప్రజాదర్బార్ తో సరికొత్త సాంప్రదాయానికి యువనేత నాంది

ప్రజాప్రతినిధి అంటే సేవకుడని నిరూపిస్తున్న లోకేష్ 12వ రోజు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అమరావతి : ప్రజా ప్రతినిధి అంటే సేవకుడని నిరూపిస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా నిస్తున్నారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. తొలుత మంగళగిరి ప్రజలకోసమని మొదలు పెట్టిన ప్రజాదర్బార్ కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతిపత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత […]

Read More

సాంకేతిక విద్య శిక్షణా మండలి కార్యదర్శిగా విజయ కుమార్

విజ‌య‌వాడ : రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శిగా వి. విజయకుమార్ నియమితులయ్యారు. సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న డాక్టర్ రమణబాబు పదవీ విరమణ పొందగా, నెల్లూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గా బాధ్యతలలో ఉన్న విజయకుమార్ కు అవకాశం లభించింది. సాంకేతిక విద్యా శాఖలో 1982లో సివిల్ […]

Read More