భారీ వర్షాలు… యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

– ఓర్వకల్లు పర్యటన రద్దు – సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ – కొండచరియల బాధిత కుటుంబాలు ఆదుకుంటాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని శనివారం సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, […]

Read More

ధర్మరాజు ఏ తప్పు చేయలేదా?

పాండవులు స్వర్గారోహణ కి సశరీరంగా వెళ్ళే క్రమంలో ఒక్కొక్కరుగా పడిపోతూ ఉంటే భీముడు ధర్మరాజుని ప్రశ్నిస్తాడు. ముందుగా ద్రౌపతి పడిపోతుంది, భీముడు చూసి ద్రౌపది ఏ పాపం చేయలేదు యోగబలం ఎందుచేత తగ్గి పడిపోయింది? అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఈవిడ పతులలో అర్జునుడి పట్ల పక్షపాత బుద్ది కలిగి ఉంది. 5గురు భర్తలపై సమబుద్ది రాలేదు. దాని ఫలమే ఇది. తర్వాత సహదేవుడు పడిపోయాడు? భీముడు మళ్ళీ ప్రశ్నించాడు […]

Read More

జానపద కళల పరిరక్షణకు కృషి

-కవులు, కళాకారులకు సముచిత స్థానం -ప‌ర్యాట‌కంలో తెలంగాణ సంస్కృతి, క‌ళారూపాల -ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ప్ర‌ణాళిక‌లు: మంత్రి జూప‌ల్లి హైద‌రాబాద్, ఆగ‌స్టు 31: తెలంగాణలో అంతరించిపోతున్న జాన‌ప‌ద‌ కళారూపాలకు మళ్లీ పునరుత్తేజాన్ని తీసుకువ‌చ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ఱారావు అన్నారు. కళారంగానికి పెద్దపీట వేస్తుంద‌ని, కవులు, కళాకారులు, ర‌చయిత‌ల‌కు సముచితస్థానం కల్పిస్తుంద‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం భాషా సంస్కృతిక […]

Read More

బాపూ గీత, రమణ రాత నిత్యనూతనమే

2014, August 31 న ఓ 80 ఏళ్ళ పెద్దాయన కాలంచేస్తే… కుంచె కన్నీరు పెట్టుకుంది.ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే బుడుగు బావురుమన్నాడు. అచ్చ తెలుగు కొంటెకోణంగి, ఇక నాకెవరు దిక్కు అంటూ వాపోయింది. కాలభ్రమణంలో పదేళ్ళు గిర్రున తిరిగిపోయినా… సత్తిరాజు లక్ష్మీనారాయణ… బొమ్మల,సినిమా ప్రపంచానికి ఆమాటకొస్తే… తెలుగు భాషకు విలక్షణ రాతను నేర్పిన పరిచయం అక్కర్లేని పేరు “బాపు”! “ముత్యాల ముగ్గులేసి” జరిపించిన “సీతా కళ్యాణం” “సాక్షి” గా… […]

Read More

కొండచరియలు విరిగిపడ్డ ఇద్దరి మృతి

విజయవాడ, మహానాడు: భారీ వర్షాలకు విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మొగల్రాజపురంలో ఇళ్ళపై కొండచరియలు విరిగిపడగా పలువురు శిథిలాల్లో చిక్కుకున్నారు. తొలుత మేఘన అనే యువతి చనిపోగా తాజాగా మరొకరు ప్రాణాలు విడిచారు. అధికారులు ఆరుగురిని కాపాడారు. ఘటనాస్థలంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Read More

వారిని అర్ధనగ్నంగా ఊరేగించాలి

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముంబై సీని నటి కాదంబరీ జత్వానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బాసటగా నిలిచారు. ఆమెను ఇబ్బంది పెట్టిన వారిని ముంబై, విజయవాడ, హైదరాబాద్ వీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించాలని తెలిపారు. అలా చేయడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మదనపల్లె ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దగ్ధంపై లోతైన విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని చెప్పారు.

Read More

అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ

శనివారం ఉదయం 6:00″గం నుండి” రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు నగరాలు నీట ములగడం జరిగినది ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అధికారులతో వెళ్లి నీట మునిగిన ఇళ్లను పరిశీలించి వెంటనే మురుగు నీరు మోటార్లు చెప్పించి బయటకు లాగవాల్సిందిగా అదేశించి, స్థానికులకు భోజనం, టిఫిన్ ఏర్పాట్లు చూడవలసినదిగా సంబంధిత అధికారులను స్థానిక నాయకులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా […]

Read More

వరద బీభత్సం…వర్ణనాతీతం..!

వరద బీభత్స ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత పర్యటన నడుం లోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే కేపి బాధిత ప్రజలను చూసి చలించిన ఎమ్మెల్యే వసంత వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షాలతో వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు తన పర్యటనను కొనసాగించారు. […]

Read More

ప్రతి పేదకూ ‘ఎన్టీఆర్ భరోసా’

– హామీకి కట్టుబడి తొలి నెల నుండే రూ.4వేల పెన్షన్ – మచిలీపట్నంలో సాయంత్రానికి 100 శాతం పంపిణీ పూర్తి – పెన్షన్ల పంపిణీపై సచివాలయ సిబ్బంది చొరవ అభినందనీయం – నిండు గర్భిణిగా ఉండీ పెన్షన్లు పంపిణీ చేయడం హర్షణీయం – భారీ వర్షంలోనూ పెన్షన్ల పంపిణీ చేపట్టిన మంత్రి కొల్లు రవీంద్ర పేదలకు ఆర్ధికంగా భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడచుకుంటోందని రాష్ట్ర గనులు, భూగర్భ […]

Read More

ముంబై నటి కేసులో దోషుల అరెస్టుపై కాలాతీతం వద్దు

రాష్ట్ర పరువును, ఐపిఎస్ గౌరవాన్ని తీసి ముంబై నటి పై హిడింబి లా ప్రవర్తించిన ముగ్గురు ఐపిఎస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో ఆలస్యం, కాలాతీతం సరైనది కాదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుటికే ఈ దుర్మార్గమైన వ్యవహారంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమే… ఐనా చర్యలు తీసుకుంటేనే చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ లో మార్పు వస్తుందన్నారు. […]

Read More