దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు రండి

-సీఎం చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి, అధికారులు విజయవాడ, మహానాడు: ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వచ్చే నెల మూడోతేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.

Read More

ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ డ్యాం సందర్శన

– టి. లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ తెలుగు ప్రజలకు గర్వకారణం. పదుల వేల కుటుంబాలకు జీవనాధారం. ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా, 1967 ఆగస్టు 4న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసి […]

Read More

ఆదివారం కూల్చివేతలు ఎందుకు?

– హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం! హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశం మేరకు విచారణకు హైడ్రా కమీషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. కోర్టు రంగనాథ్‌కు చీవాట్లు పెట్టింది. హైకోర్టు ఏమన్నదంటే… ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పండి. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక […]

Read More