వచ్చే ఏడాది సరస్వతి నది పుష్కరాలు

కాళేశ్వరం: సరస్వతి నదికి వచ్చే ఏడాది పుష్కరాలు రానున్నాయి. 2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశి లోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుందని కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు కృష్ణ మూర్తి శర్మ, ఫణీంద్ర శర్మలు తెలిపారు. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్య స్నానాలు ఆచారించాల్సి ఉంటుందన్నారు. కాగా, పుష్కరాల నిర్వహణ తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read More

ఆంధ్రాలో ఉచిత గ్యాస్ బుకింగ్ రేపటి నుంచి..

విజయవాడ, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చని, గ్యాస్ కనెక్షన్ తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More