(వెంకటాచారి) కాకినాడ: ఆషాడం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్న కుమారికి కాకినాడకు చెందిన రవి తేజకు గత ఏడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వివాహమై ఆషాడ మాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసంలో తొలిసారిగా అత్త వారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి […]
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.. 13 వందల 90 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడికి వద్ద.. బూట్లు, బ్యాగులో బంగారం దొరికిందన్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.పట్టుకున్న బంగారం విలువ కోటి రూపాయలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వివరించారు.
Read Moreఆ చెట్టు ఉంటే సినిమా హిట్టే!
145 సంవత్సరాల మహా వృక్షం కనుమరుగు (టివి గోవింద రావు) సినిమాలో మనకు తరచుగా కనిపించే కుమారదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక చరిత్ర..ఈ తెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది. కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరుచెట్టును గోదారితల్లి ఒడ్డున మహానుభావుడు సింగలూరి తాతబ్బాయి నాటారు. ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ,తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి […]
Read Moreసిరిసిల్ల జిల్లాలో మగవారిపై కాకుల దాడి
(జానకీదేవి, తణుకు) సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మగవాళ్లపై కాకులు పగ బట్టాయి. కేవలం మగవాళ్ల తలపై కాళ్లతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి. విచిత్రంగా ఉన్నా నమ్మి తీరాల్సిందే. ఇందుకు సంబం ధించిన వీడియోసైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. సిరిసిల్ల పాత బస్టాండ్ లో కట్ట మైసమ్మ గుడివద్ద తిరుగు తున్న మగవాళ్లపై కాకులు […]
Read More‘పొదుపు’లో ఏపీ దేశంలోనే నెంబర్‌వన్
– నాబార్డు నివేదిక అమరావతి : ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా సంఘాల పొదుపులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 మార్చికి అన్ని రాష్ట్రాల పొదుపు రూ. 65,084cr కాగా దక్షిణాది పొదుపు రూ 29,409 కోట్లు, ఇందులో ఏపీ పొదుపు రూ 17,292cr. ఇది దేశంలోనే అత్యధికం. ఆ తర్వాత తెలంగాణ (రూ 5,768 కోట్లు ), తమిళనాడు (రూ2,854 కోట్లు )కర్ణాటక (రూ 2,024 కోట్లు ) ఉన్నాయి. అలాగే […]
Read Moreరాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ పేరిట తెలుగు విశ్వవిద్యాలయం
-ముఖ్యమంత్రికి విన్నవించిన పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ -తెలుగు విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్లు మంజూరు అభినందనీయం -ఎన్ టి ఆర్ మానస పుత్రికగా ఆవిర్భవించిన తెలుగు విశ్వవిద్యాలయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించటం అభినందనీయమని పద్మభూషణ్ అచార్య లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు. విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుని హోదాలో అమెరికా పర్యటనలో ఉన్న యార్లగడ్డ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ […]
Read Moreఈ నెల 20 నుంచి కొత్త ఓటర్ల నమోదు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి బీఎల్ఓ లు ఇంటింటి సర్వేను నిర్వహించ నున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నాటికి ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితా […]
Read Moreసామాన్యుడి ప్రాణాన్ని కాపాడిన హోమ్ మంత్రి అనిత కాన్వాయ్
– పోలీస్ డ్రైవర్ అప్రమత్తత – ఏలూరు జిల్లా కైకరం జాతీయ రహదారిపై ఘటన ఏలూరు జిల్లా: రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఎస్కార్ట్ డ్రైవర్ అప్రమత్తతతో ఓ సామాన్యుడి నిండు ప్రాణానికి ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం హోమ్ మంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ కైకరం వద్దకు చేరే సరికి రోడ్డు పక్కన వెళ్తున్న ఓ ద్విచక్ర వాహన […]
Read Moreకరోనా మళ్ళీ వచ్చింది
-84 దేశాల్లో భారీగా కేసులు -ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ కరోనా మళ్లీ వచ్చింది. 84 దేశాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 2024. ఆగస్టు రెండు వారాల్లో కేసులు సంఖ్య, సాధారణం కంటే 20 శాతం పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు.. పారిస్ ఒలింపిక్స్ లో 40 మంది అథ్లెట్లు కరోనా సంబంధమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించి […]
Read More70 ఏళ్లు 70 అడుగులు
– సప్తముఖ గణేశుడిరూపంలో దర్శనం హైదరాబాద్ : గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. ఈసారి కొలువుదీరే గణేశుని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌లో ది ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా […]
Read More