వరంగల్: వరంగల్ కేఎంసీ అనస్తీషియా విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన డా. సైఫ్ ఈ నెల 17న ఉమ్మడి వరంగల్ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో హాజరుకానున్నారు. న్యాయమూర్తి నేర నిర్ధారణ విచారణ చేయనున్నారు. అనంతరం ట్రయల్ తేదీల కోసం కేసు వాయిదా వేస్తారు. గత సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
Read Moreకేజ్రీవాల్ భార్య సునీతకు కోర్టు నోటీసు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టుకు హాజరైనప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సూచించింది. దీనిపై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మలతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. కేజ్రీవాల్ గతంలో రౌస్ అవెన్యూ కోర్టులో చేసిన ప్రసంగం కాసేపటికే సోషల్ మీడియాలో కనిపించింది.
Read Moreపోలీసు శాఖ ప్రక్షాళన
– మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి – హోంమంత్రి అనిత రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని ఆమె తెలిపారు.మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ […]
Read Moreరెండున్నరేళ్లలో ‘అమరావతి’ పూర్తి చేస్తాం
– మంత్రి నారాయణ రాజధాని అమరావతి పరిస్థితి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేయనున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఆ నివేదిక రావడానికి 2,3 నెలల సమయం పడుతుందన్నారు. మరో 10 రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత వస్తుందని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read Moreనా అనంత ‘ప్యూర్’ ..అంతులేని స్వచ్చ‘ట’
ఈస్ట్ సైడ్ తాడిపత్రి (పెమ్మసాని వారి రాజధాని) వెస్ట్ సైడ్ పెన్నహోబిళం (పెన్న ఒడ్డున సదాశివరాయలు కట్టించిన దేవాలయం) నార్త్ సైడ్ గుత్తి, కసాపురం (తిమ్మరుసు వారిది) సౌత్ సైడ్ పెనుగొండ, లేపాక్షి…(పెనుగొండ – అష్టపదులకు వ్యాఖ్యానం వ్రాసిన ఒంటికన్ను తిర్మలరాయలు, భట్టుమూర్తి వసుచరిత్ర తాలూకు ఘనగిరి, ఇక లేపాక్షి – అచ్యుతరాయల వారి కాలపు కూర్మగిరిపై కట్టిన ఘనమైన దేవాలయం) ఆల్ సైడ్స్ ఘనమైన చరిత్రకు, తెలుగువాళ్ళ సాంస్కృతిక […]
Read Moreఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ పూర్తి ప్రక్షాళన
– ‘స్పందన’ పేరు మార్పు – చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్పందన’ వ్యవస్థ ప్రక్షాళనను ప్రభుత్వం చేపట్టింది.’స్పందన’ పేరును శనివారం తొలగించింది. ఇకపై ‘ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాలు’ పేరుతో వినతలను స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. స్పందన వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించగా.. ఫిర్యాదుల స్వీకరణ […]
Read Moreమంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”
-తొలిఅడుగులోనే యువనేత సంచలన నిర్ణయం -ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్న లోకేష్ మంగళగిరి: గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్… ఇటీవల ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజారిటీతో ఘనవిజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్… నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా […]
Read Moreఆదివారం దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్
దేశవ్యాప్తంగా ఆదివారం UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాలి.
Read Moreఅయిదు సంతకాలతో ప్రజల లోగిళ్లలో కొత్త సంతోషాలు
జీవీ ఆంజనేయులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే చంద్రబాబు చేసిన అయిదు సంతకాలతో రాష్ట్రంలోని ప్రతి లోగిలో కొత్త సంతోషాలు విరబూశాయన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా వైకాపా చేస్తోన్న దుష్ప్రచారాలకూ ఈ సంతకాలతో చెంపపెట్టులాంటి సమాధానం చెప్పినట్లైందన్నారు. ఆర్థికంగా, పరిపాలనపరంగా ఎన్నో సవాళ్లున్నా ఇచ్చిన మాట ప్రకారం మొదటిరోజు అలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబుకు మాత్రమే […]
Read Moreచంద్రబాబు కు దివ్యాంగుల పాలాభిషేకం
గుంటూరు లాడ్జి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగుల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోనుగుంట్లకోటేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.దివ్యాంగుల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ… దివ్యాంగుల ఫెంక్షన్ 3వేల నుంచి6వేల రూపాయలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. వైసీపీప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి దివ్యాంగుల ఉసురు తగిలి సర్వనాశనం ఐపోయాడని ఎద్దేవాచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు […]
Read More