• టీడీపీ పార్టీ అధికారంలోకి రాకుండా పోలీసు అధికారులు రాజేంద్రనాథ్ రెడ్డి, సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ పన్నిన కుట్రను కూడా సిట్ వెలికి తీయాలి • మాచర్లలో పోలింగ్ సందర్భంలో అరాచకం సృష్టించి రక్తపాతానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పిన్నెళ్లి అతని తమ్ముడు వెంకట రామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి • టీడీపీ నేత నానిపై హత్యాయత్నానికి కారకుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి […]
Read Moreఅంబేద్కర్ కి మోదీ పూజలు
ప్రధాని మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. తాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు.
Read Moreఅప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభం
సింహాచలం అప్పన్న దేవాలయంలో రెండు ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తితో కలిసి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలని, రెండున్నర గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందన్నారు. భక్తుల సౌకర్యార్ధం కాలుష్యాన్ని తగ్గించేందుకు రెండు బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందుబాటులో ఉంచామని అశోక్ గజపతిరాజు తెలిపారు.
Read Moreఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.మే 24 నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Read Moreమూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియమాకం
అమరావతి: పల్నాడు జిల్లాకు మల్లికా గర్గ్, తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్, అనంతపురం జిల్లాకు గౌతమి శాలిని నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Read Moreఈఏపీ సెట్ మొదటిసారి నిర్వహించాం
-త్వరలో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల -విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్, మహానాడు: తెలంగాణ ఈఏపీ సెట్ మొదటిసారి నిర్వహించినట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈఏపీ సెట్ ఫలితాల విడుదల అనంత రం ఆయన మాట్లాడారు. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు జరిగేవన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 1,00,432 మంది దరఖాస్తు చేసుకోగా 91,633 మంది, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో […]
Read Moreఎన్నికల హింసపై ఈసీకి ప్రాథమిక నివేదిక
-కీలక నేతలను అరెస్టు చేసే అవకాశం -స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్‌కు మూడంచెల భద్రత -క్షేత్రస్థాయి పర్యటనలకు సీఈవో మీనా అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక విచారణ పూర్తిచేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను సీఈవో కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఆ నివేదిక ఆధారంగా ఈసీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించనుంది. […]
Read More1986లో ఎక్కడున్నావు మోదీ?
-కాంగ్రెస్ హయాంలోనే రామమందిరం తెరిచింది -రామరాజ్యం స్ఫూర్తిగా రాజీవ్‌గాంధీ పాలన -ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్, మహానాడు: గాంధీభవన్‌లో శనివారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను గౌరవించాల్సిన ప్రధాని మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం దురదృష్టకరం. దేశంలో ప్రార్థన మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ లల్లా మీద బుల్డోజర్ తీసుకువస్తారని ప్రచారం […]
Read Moreహైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు
హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్లకు సంబంధించి ఇప్పటివరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంట లకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతాయి. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం. […]
Read Moreతెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల విడుదల
-మొత్తం 2,62,587 మంది అర్హత -ఏపీ విద్యార్థులకు తొలి రెండు ర్యాంకులు హైదరాబాద్, మహానాడు: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించి న ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 2,62,587 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో 74.98 శాతం, అగ్రికల్చ ర్, ఫార్మా కోర్సుల ఎంట్రన్స్‌లో 89.66 శాతం అర్హత సాధించారు. మొదటి 10 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు సమానంగా […]
Read More