వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్ లో బుధవారం టీడీపీలో చేరారు. ఇక్బాల్ కు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. మహ్మద్ ఇక్బాల్ నేపథ్యం పరిశీలిస్తే ఆసక్తి కలిగిస్తుంది. ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ […]
Read Moreచంద్రబాబు నాకు దైవంతో సమానం
-అరుణ్ జైట్లీ సలహాతోనే తాను బీజేపీలోకి వెళ్లా -పొత్తు కోసం పవన్ కల్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు -నాగబాబు టికెట్ ను కూడా పొత్తు కోసం త్యాగం చేశారు -మూడు పార్టీల సమావేశంలో విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : దివంగత అరుణ్ జైట్లీ సలహాతోనే తాను బీజేపీలోకి వెళ్లానని రాజ్యసభ మాజీ సభ్యుడు, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. తనకు […]
Read Moreపేదల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం ఎందుకు?
-ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేదల కనీస అవసరాలను తీర్చలేకపోతున్న ఇలాంటి ప్రభుత్వం అవసరమా? అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మేం అది చేశాం, ఇది చేశామని డబ్బాలు కొట్టుకోవడం కాదు పేదల కష్టాలు తీర్చాలని జగన్ సర్కారుపై మండిపడ్డారు. బిడ్డ మృతదేహాన్ని భుజాన మోస్తూ ఓ తండ్రి కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. మీ ఇంటికి, మీ గ్రామానికి […]
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావుకు రిమాండ్ పొడిగింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను నాంపల్లి కోర్టు మరోమారు పొడిగించింది. ఆయన వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయనను ఈ ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాల అనంతరం మరో రెండు రోజులు అంటే 12వ తేదీ వరకు రాధాకిషన్‌రావు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. విచారణ సందర్భంగా పోలీసులపై రాధాకిషన్‌రావు పలు ఆరోపణలు చేశారు. జైలు […]
Read Moreఅడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పిహెచ్ డి
-సంక్షేమంపై చర్చకు మేం రెడీ… జగన్ సిద్ధమా? ! -చంద్రబాబు వస్తే పెట్టుబడులు…జగన్ వస్తే దాడులు! -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: సంక్షేమం పేరుతో పేదల ఎకౌంట్లలో రూ.10 వేసి వంద లాగేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య, 5ఏళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారు… ఎవరి హయాంలో ఎక్కువ […]
Read Moreసుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం
లిక్కర్ పాలసీ స్కాంలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఈడీ చేసిన వాదనతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ […]
Read Moreవైసీపీ తీర్థం పుచ్చుకున్న పోతిన మహేశ్
జనసేన పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన పోతిన మహేష్ ఈ ఉదయం వైసీపీలో చేరారు. గుంటూరు పర్యటనలో ఉన్న జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ […]
Read More‘వివేకం’ సినిమా చూసి ప్రజలు ఓటు వేయాలి
-టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే అధికారం -మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ‘వివేకం’ సినిమా చూశాక ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందన్న ఆయన తాను వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో ముచ్చటించారు. వివేకం సినిమా చూసి ఓటేయాలని తన […]
Read Moreయువగళం పాదయాత్రను కళ్లకు కట్టిన “శకారంభం”!
యువనేత నారా లోకేష్ చేతులమీదుగా పుస్తకావిష్కరణ ఉండవల్లి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన “శకారంభం” పుస్తకాన్ని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత 27-1-2023న ప్రారంభమైన యువగళం పాదయాత్ర… 97 […]
Read Moreసుప్రీం కోర్టుకు రామ్‌దేవ్ బాబా క్షమాపణలు
తుప్పదారి పట్టించే అడ్వర్టైజ్‌మెంట్ కేసులో యోగా గురు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు వారు కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఒక రోజు ముందే క్షమాపణలు తెలిపారు. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనల విషయాన్ని సుప్రీం […]
Read More