పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం హైదరాబాద్‌, మహానాడు:  ఖరీఫ్‌లో రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసిందని, దానికి సరిపడా బీజీఐఐ విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం అధికారులను ఆదేశించారు. 2021లో 60.53 లక్షలు ఉన్న పత్తి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ 2023లో 45.17 లక్షలకు వచ్చిందని, […]

Read More

రేవంత్‌ వ్యాఖ్యలపై హరీష్‌రావు ట్వీట్‌

-వ్యవస్థను కుప్పకూల్చావు -ప్రతిపక్షాలు, ఉద్యోగులపై ఆరోపణలా? -చిల్లర మాటలు ఆపాలని హితవు హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులపై సీఎం రేవంత్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు ఖండిరచారు. కరెంట్‌ కోతల విషయంలో వైఫల్యా లను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్‌ ఉద్యోగులపై అభాండాలు మోపడం సరి కాదని వ్యాఖ్యానించారు. ఆయన వైఖరి ఆడ లేక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తుంది. బిఆర్‌ఎస్‌ […]

Read More

చింతమనేని కార్యాలయంలో సందడి

దెందులూరు, మహానాడు: ఐదేళ్లు అవినీతి, అక్రమాలు, ప్రశ్నిస్తే దాడులే లక్ష్యంగా సాగిన వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వారు కూటమి గెలుస్తుందన్న వార్తలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాలలోని చింతమనేని కార్యాలయంలో బుధవారం ఉదయం పలు గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోలింగ్‌లో దెందులూ రు నియోజకవర్గంలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు సహా ఏలూరు రూరల్‌ మండ లాల్లోని అన్ని గ్రామాల్లో ఓటర్లు తరలివచ్చి […]

Read More

మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పోలీసుల గుర్తింపు

-ఎప్పటికప్పుడు పిన్నెల్లి అనుచరులకు సమాచారం -కాల్‌ డేటాను విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు మాచర్ల, మహానాడు: మాచర్లలో పోలీసుల కదలికలు, డిపార్ట్‌మెంటల్‌ యాక్షన్‌ను ఎప్పటికప్పుడు పిన్నెల్లి మనుషులకు చేరవేసిన పలువురు కిందిస్థాయి సిబ్బందిని కాల్‌డేటా ఆధారంగా గుర్తించా రు. అల్లర్ల నేపథ్యంలో మాచర్లలో ప్రత్యేకంగా పోలీసులు బలగాలను మోహరించి తనిఖీ లు చేసే విషయాన్ని ముందుగా వైసీపీ నేతలకు చేరవేసిన ఏడుగురిని కాల్‌ డేటా ఆధా రంగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. పోలీసుస్టేషన్‌లో […]

Read More

గెలిస్తే మోదీ అవినీతి పాఠశాల మూత: రాహుల్‌గాంధీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శ లు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని మోదీ నడుపుతున్నారు. ఈ స్కూల్‌లో ‘డొనేషన్‌ బిజినెస్‌’ అనే కోర్సులోని ప్రతీ అధ్యాయాన్ని స్వయంగా ఆయనే బోధిస్తున్నారు. ధానాన్ని కూడా వ్యాపారంగా ఎలా […]

Read More

పోలీసుల కాళ్లు మొక్కిన రైతులు

-వడ్లు తడుస్తున్నాయి..కొనాలని గోడు -భువనగిరి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా భువనగిరి: వడ్లు తడుస్తున్నాయి..దయచేసి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనాలని భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు తడిసిన ధాన్యం బస్తాలతో వచ్చి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రాగానే వారి కాళ్లు మొక్కుతూ తమ సమస్యను వివరించారు. […]

Read More

దేశంలోనే ఏపీలో అత్యధిక పోలింగ్‌

-రికార్డు స్థాయిలో 81.86 శాతం నమోదు -గత ఎన్నికల కంటే 2.09 శాతం ఎక్కువ -దర్శిలో అత్యధికం 90.91 శాతం -తిరుపతిలో అత్యల్పం 63.32 శాతం -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా పూర్తి వివరాలు వెల్లడిరచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ […]

Read More

పులివర్తి నానికి అమర్నాథ్‌ రెడ్డి పరామర్శ

తిరుపతి : వైసీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని బుధవారం అమర్నాథ్‌ రెడ్డి పరామర్శించారు. దాడి ఘటనను ఖండిరచారు. డిపాజిట్లు కూడా రావని, ఓడిపోతారన్న భయంతో చెవిరెడ్డి కుమారుడు యూనివర్సిటీ ఆవరణలో పులివర్తి నాని, ఆయన సెక్యూరి టీ గార్డులపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఈవీఎం మిషన్లను భారీ బందోబస్తు యూనివర్సిటీలకు తీసుకెళ్లే టప్పుడు ప్రతి వాహనాలు […]

Read More

బొత్సా… ఓడితే తప్పుకుంటావా?

-కూటమికి 130 సీట్లు ఖాయం -టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు కూటమికే ఓట్లు వేశారు. 2019లో జగన్‌ను గెలిపించడానికి జనాలు ఎలా క్యూ కట్టారో ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడానికి క్యూ కట్టారని, 130 స్థానాలలో గెలుపు ఖాయమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఎంసీపీ(మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌) మహా కూటమి సూపర్‌ సక్సెస్‌ అయిందన్నా రు. 2019లో 79 శాతం పోలైతే […]

Read More

నరరూప రాక్షసులు వైసీపీ నేతలు: లోకేష్

అమరావతి: ఓటమి భయంతో వైసీపీ నేతలు నరరూప రాక్షసులుగా మారారని టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో తిరుపతి జిల్లాలోని పెళ్లకూరుమిట్టకు చెందిన మహిళపై గర్భిణి అని చూడకుండా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ లేకుండా చేసిన వైసీపీకి పతనం ఖాయమన్నారు గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More