-ఖమ్మంలో రికార్డు మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు -మీ వాణిని ఆర్‌ఆర్‌ఆర్ ఢిల్లీలో వినిపిస్తారు -తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా…. దాన్ని తిరగ రాయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజక అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి విజయం సాధించడం పట్ల […]
Read Moreనన్ను ఓడించాలని కుట్ర చేస్తే…కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది
-కరీంనగర్ ప్రజలు దమ్మేందో చూపారు -గ్యారంటీల కోసం కాంగ్రెస్ అంతు చూస్తాం -కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా… -మోదీహవాతోనే ఇంతటి మెజారిటీ దక్కింది -కాంగ్రెస్ విష ప్రచారంతోనే బీజేపీ మెజారిటీ తగ్గింది -ఫలితాల అనంతరం బండి సంజయ్ వ్యాఖ్యలు కరీంనగర్: ’’బండి సంజయ్ గలీజోడు… ముస్లింలంతా ఏకమై ఆయనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చిండు… ఏమైంది.. అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అడ్రస్సే గల్లంతు చేశారు’’అని బీజేపీ […]
Read Moreతెలంగాణలో బండి సంజయ్ రికార్డ్ విజయం
కరీంనగర్‌లో కేసీఆర్, వినోద్ రికార్డులు బద్దలు 2.25 లక్షల పైచిలుకు ఓట్లతో విజయకేతనం 45 శాతం ఓట్లు సాధించిన సంజయ్ రెండో స్థానం కోసమే పోటీపడ్డ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు 27.4, బీఆర్‌ఎస్‌కు 21.4 శాతం ఓట్లు అఖండ విజయంతో కరీంనగర్‌లో బీజేపీ కార్యకర్తల తీన్మార్ బండి విజయంతో సంబరాల్లో మునిగితేలిన కార్యకర్తలు భుజాలపైకి ఎత్తుకుని ఆనందాన్ని పంచుకుంటున్న శ్రేణులు కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ […]
Read Moreకూటమి గెలుపుపై ఏపీజేఏసీ హర్షం
అమరావతి: నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబుకు ఉద్యోగుల పక్షాన ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళికృష్ట నాయుడు మంగళవా రం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreగుంటూరు వైసీపీ కార్యాలయంపై రాళ్ల దాడి
గుంటూరు: నగరంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దాంతో అద్దాలు పగిలాయి. అనంతరం విడుదల రజనికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చెయ్యి దాటుతుండటంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. విడుదల రజిని కార్యాలయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ఎసీపీ నచికేట్ షెల్క్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Read Moreరాజధాని లేని,గాయపడిన రాష్ట్రాన్ని గాడిన పెట్టండి
– మెగాస్టార్ చిరంజీవి చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న టిడిపి చీఫ్ చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ‘ఈ మహత్తర విజయం రాష్ట్రానికి గత రాజకీయ వైభవం తిరిగి తెచ్చిన మీ దక్షతకు నిదర్శనం.. దురంధరులైన మీరు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని నిలబెట్టు కుంటారని ఆశిస్తున్నా.. రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నంబర్-1 గా తీర్చి దిద్దుతారని […]
Read Moreగెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్ పత్రాలు
అమరావతి: ఎన్నికల్లో గెలుపొందిన ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనే యులు, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణకుమా ర్‌లకు రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఫారాలను అందజేశారు.
Read Moreచరిత్రని తిరగరాసి`నారా లోకేష్`
– నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక మెజారిటీ -72 ఏళ్ల మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో నారా లోకేష్ రికార్డ్ మంగళగిరి నియోజకవర్గ 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నారా లోకేష్ నిలిచి రికార్డు నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటివరకూ అంటే 2024 సంవత్సరం వరకూ పోటీ చేసిన అభ్యర్థులలో అత్యధిక మెజారిటీ 91,413 ఓట్ల […]
Read Moreఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళి
మంగళగిరి: ఫలితాల అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
Read Moreదుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ
విజయవాడ: రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించా లని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు అంతా మంచి జరగనుందన్నారు. ఐదేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి ఈ రోజుతో ముగింపు కలగబోతోందన్నారు. అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్రంపై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరిం చారు. […]
Read More