పట్టుదల, అంకితభావానికి నిదర్శనం రామోజీరావు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావుకు ఘన నివాళులర్పిం చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రామోజీరావు మృతి వ్యక్తిగతంగా చాలా కలచివేసింది. సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైన వ్యక్తిగా ఎదిగి పట్టుదల, అంకితభావంతో నమ్మిన సిద్ధాం తం కోసం పనిచేశారని కొనియాడారు. సుదీర్ఘకాలంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదని, వైసీపీ పాలనలో […]

Read More

గుంటూరులో రామోజీరావుకు ఘన నివాళి

గుంటూరు: నగరంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా దిగ్గజం రామోజీ రావు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. తాడికొండ, ప్రత్తిపా డు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్‌, బూర్ల రామాంజ నేయులు, గళ్లా మాధవి, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార రంగాలలో ప్రతిఒక్కరికి దారిచూపిన మార్గదర్శకుడు, దార్శనికుడని కొనియాడారు. రామో జీ ఫిల్మ్‌ సిటీ అనే అద్బుతాన్ని […]

Read More

రవాణా మంత్రి పొన్నం రూ.100 కోట్ల కుంభకోణం

వే బిల్లులు లేకుండా బూడిద అక్రమ రవాణా రోజుకు 200 నుంచి 300 లారీల తరలింపు రోజుకు రూ.50 లక్షల పైనే అక్రమ సంపాదన వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలి హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ తరలుతున్న ఫ్లై యాష్‌ లారీల పట్టివేత హుజురాబాద్‌: రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు రూ.50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబా […]

Read More

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై విచారణ జరిపించాలి

ఫలితాల్లో అవకతవలపై అనుమానాలున్నాయి ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చదవడానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మే 5న దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పరీక్షను […]

Read More

అక్షర శిల్పి రామోజీ

చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్‌, ప్రియా ఫుడ్స్‌, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనం లోని ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్‌ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించింది. […]

Read More

జగ్గయ్యపేటలో రామోజీకి నివాళి

జగ్గయ్యపేట: పట్టణంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య నివాసంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు ఎమ్మెల్యే తాతయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

దర్శిలో రామోజీరావుకు నివాళి

దర్శి: టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం రామోజీరావు చిత్రపటానికి దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, బీజేపీ నాయకులు మాడపాకుల శ్రీను, తిండి నారాయణరెడ్డి పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మీడియా రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమని, మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని పేర్కొన్నారు.

Read More

రామోజీ మృతికి త్రిపుర గవర్నర్‌ సంతాపం

త్రిపురం: ఈనాడు అధినేత రామోజీరావు మృతి పట్ల త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబానికి సాను భూతి తెలిపారు. రామోజీతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. శాసన సభ్యుడి గా ఉన్న సమయంలో తరచూ రామోజీని కలిసేవాడినని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహించిన మలక్‌పేట, అబ్దుల్లాపూర్‌ మెట్‌లో రామోజీ ఫిలిం సిటీని స్థాపించి మలక్‌పేట అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచారని గుర్తుచేశారు. ఒడిదుడు కులను ఎదుర్కొని […]

Read More

రామోజీ మృతి తీరనిలోటు: ధూళిపాళ్ల

పొన్నూరు: అక్షర యోధుడు, నిరంతర శ్రామికుడు, దేనికి తలవంచని ధీశాలి, తెలుగువారు గర్వించదగ్గ దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగుజాతికి తీరని లోటని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More

రామోజీ సేవలు చిరస్మరణీయం

ఆయన మృతి తెలుగుజాతికి తీరనిలోటు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి: రామోజీరావు మృతికి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పత్రిక, సాహితీ రంగంలో సంచలనానికి నాంది పలికిన ఈనాడు, సితార, చతుర, విపుల, రైతు బంధు ‘అన్నదాత’ ఇవన్నీ మీ మానస పుత్రికలే. మార్గదర్శి ఎందరికో తోడుగా నిలబడి ఆర్థిక స్వావలంబన దిశగా సహాయపడిరది. రామోజీ ఫిల్మ్‌ సిటీ తెలుగు […]

Read More