వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా..!!

మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన శిద్ధా.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

Read More

రుషికొండ పై ఎందుకీ దాగుడుమూతలు?

– ట్విట్టర్ వేదికగా వైసీపీకి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చురకలు విశాఖ : రాజకోట రహస్యం ఎన్నికల ముందే వెల్లడై ఉంటే 11 సీట్లు వచ్చేవి కావు. రుషికొండ భవన నిర్మాణంపై ఎందుకీ కుప్పిగంతులు, దాగుడుమూతలు? మొదట టూరిజం ప్రాజెక్ట్ అన్నారు.. తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు. అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఏ నిర్మాణమైనా ప్లాన్ వివరాలను ఆ కట్టడం దగ్గర ప్రదర్శిస్తారు. సెక్యూరిటీ కారణాల […]

Read More

రెండు దశాబ్దాల తర్వాత గెలుపుతో పేటలో అంబరాన్నంటిన సంబరాలు

– టీడీపీ నేతల సంబరాలతో పసుపుమయమైన నరసరావుపేట నరసరావుపేటలో తెలుగుదేశం గెలుపుతో ప్రజలు కార్యకర్తలు సంబరాలో మునిగితేలుతున్నారు.నరసరావుపేట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో టీడీపీ మహిళల ఆధ్వర్యంలో కోలాటం అత్యంతం అలరించింది.కార్యక్రమానికి ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబును భారీ ర్యాలీగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రజలు కార్యకర్తలు ఏ స్థాయిలో ఎదురు చూశారో ఈ రోజు జరుగుతున్న సంబరాలు నిదర్శనమని ఆనందబాబు పేర్కొన్నారు.జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన పై […]

Read More

తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు

అమరావతి : వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని….ఈ పోరాటంలో పార్టీ లీగల్ సెల్ చేసిన కృషి ప్రశంసనీయమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వమే దారుణాలకు పాల్పడడం, రౌడీయిజం చేయడం అనేది వైసీపీ హయాంలోనే చూశామన్నారు. ఉండవల్లి నివాసంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. నాలుగవసారి సిఎం అయిన చంద్రబాబు నాయుడుకు లీగల్ […]

Read More

అమెరికా బే ఏరియాలో టీడీపీ-జనసేన అభిమానుల సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని చిత్తుగా ఓడించి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అమెరికా లో బే ఏరియా కి చెందిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభిమానులు, టీడీపీ, జనసేన మరియు భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫ్రీమోంట్ నగరంలోని సెంట్రల్ పార్క్ ఈ సంబరాలకి వేదిక అయ్యింది. ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షులు […]

Read More

అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి

– 24, 25, 26 తేదీల్లో 3 రోజులపాటు సమావేశాలు – స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు? – చీఫ్ విప్ రేసులో ధూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్? అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి శాసన సభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25, 26 తేదీల్లో 3 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. 24న ప్రొటెం […]

Read More

తెలంగాణ ఉద్యోగులు ఆందోళన పడవద్దు

ఏపీ ఉద్యోగులెవరూ తెలంగాణకు రావడం లేదు ఆ పుకార్లు నమ్మవద్దు విభజన చట్టం అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశం తప్పుడు సమాచారం నమ్మొద్దు ఉద్యోగులను అప్రమత్తం చేసిన తెలంగాణ సర్కార్ హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యత […]

Read More

సురేశ్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్లమెంటరీపార్టీ పగ్గాలు

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత- రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత కేఆర్ సురేశ్ రెడ్డిని అధినేత కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కె.కేశవరావు స్థానాల్లో కేఆర్ సురేశ్ రెడ్డిని నియమిస్తున్నట్టు, ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు మరియు లోక్సభ సెక్రటరీ జనరల్ కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విడి విడిగా లేఖలు రాశారు.  

Read More

బాబు బక్రీద్ శుభాకాంక్షలు

బాబుతో ముస్లిం సంఘాల భేటీ బక్రీద్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. సీఎంను కలిసిన వారిలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి […]

Read More

గర్భిణీలు,చిన్నారులు, గిరిజనుల్లో పౌష్టికాహారలోప నివారణకు పటిష్ట చర్యలు

• గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ఫీడర్ అంబులెన్సులను ప్రవేశపెడతాం • త్వరలో గిరిజన గర్భిణీ స్త్రీల వసతి గృహాలను ఏర్పాటు చేస్తాం • అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం • ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధుల ఆరోగ్యక్షణకై అంగన్వాడీల నియామకం • గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్యం,తాగునీరు,రహదారుల అభివృద్ధికే అధిక ప్రాధాన్యత – రాష్ట్ర గిరిజన,మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భణీలు,చిన్నారులు,గిరిజనులు పౌష్టికాహార లోపంతో […]

Read More