ఏపీ గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. ఈనెల 28న జరగాల్సిన మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త తేదీలు ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్‌ వెల్లడించింది.

Read More

బాబుకు తెలంగాణ తమ్ముళ్ల స్వాగత ఏర్పాట్లు

-బేగంపేట ఎయిర్‌వద్ద ఘనస్వాగతం కోసం సమీక్ష హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా 5న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు కి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని జాతీయపార్టీ దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంపై చర్చించడానికి […]

Read More

సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన పవన్ కల్యాణ్

నాగులాపల్లి: పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు.కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను […]

Read More

అన్ని చోట్లా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి

-కనీసం తాగునీటి పరీక్షలూ జరపడం లేదు -ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి -కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు -సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి -గ్రామాల్లో మళ్లీ వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు చేయండి – సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై మూడు శాఖలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]

Read More

ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి

• సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వెతకండి • ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులతో కలసి తీర ప్రాంతంలో పర్యటన ఉప్పాడ: పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవెర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యచరణకు […]

Read More

గంజాయి నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీ

సభ్యులుగా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ అమరావతి, జులై 3: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మానవ వరుల అభివృద్ది, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు […]

Read More

ఐఏఎస్ అధికారులు పొలాలకు, రైతుల వద్దకు వెళ్లాలి

-రైతులకు మళ్లీ పాత పంటల బీమా -రైతులకు భరోసా కల్పించాలి -గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసింది మళ్లీ వ్యవస్థలు గాడిన పడాలి -ప్రభుత్వ సాయం, సబ్సిడీలతో రైతుల సాగు ఖర్చులు తగ్గించాలి -ఖరీఫ్ సాగు ప్రణాళిక, సాగునీటి విడుదల పై సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ -వ్యవసాయం, జలవనరుల శాఖలపై సీఎం సమీక్ష -సాగునీటి విడుదల షెడ్యూల్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు అమరావతి:-రాష్ట్రంలో ఖరీఫ్ పంటల […]

Read More

ప్రతి సమస్యను ఆసాంతం వింటూ… ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ…

• పిఠాపురంలో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • ప్రతి గ్రామంలో పర్యటిస్తా.. ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలకు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రత్యక్షంగా నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంత సమస్యను తెలుసుకునేందుకు అధికారులతో కలిసి వెళ్తూ మార్గమధ్యంలో […]

Read More

అందరికీ అందుబాటులో ఉచితంగా ఇసుక

•మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని రూపొందిస్తాం •నిర్మాణ రంగాన్ని పునరుద్దరిస్తాం, అందరికీ ఉపాధికల్పిస్తాం రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, జులై 3: రానున్న మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి ఉచితంగా ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో […]

Read More

వార్నీ.. అంగం కోసేసింది!

– పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టర్ బీహార్: శరణ్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్‌తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా నిరాకరిస్తూ వస్తున్నాడు. చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించి చివరి నిమిషంలో రాక పోవడంతో ఆగ్రహించిన యువతి అతడి ఇంటికి వెళ్లి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. అనంతరం ఆసుపత్రికి […]

Read More