పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం

– అధికారులే కాల్చేశారని ఆరోపణలు ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధమవడం కలకలం సృష్టిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి. కార్యాలయం లోని అధికారులే కాల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేస్తున్నారు.  

Read More

ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం రిమోట్ రెఫరెన్సింగ్ విధానం అమలు

పైలట్ ప్రాజెక్టుగా పోలీసు శాఖ, ఆర్టీసీ భూముల సంరక్షణకు చర్యలు దశల వారీగా ఎండోమెంట్స్, వక్ఫ్ భూములు సహా ఇతర శాఖల భూముల సంరక్షణ కోసం చర్యలు – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వెల్లడి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల భూములు ఇతర స్థిరాస్తులను జియో రెఫరెన్సింగ్ మ్యాపింగ్ ద్వారా సంరక్షించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ […]

Read More

మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

గుడివాడ: సీఎం చంద్ర‌బాబు డ్రైవ‌ర్‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఓ డ్రైవర్‌కు ఎలక్ట్రిక్ ఆటో అందజేశారు. గుడివాడలో ఇటీవల అన్న క్యాంటీన్ ను సీఎం చంద్ర‌బాబు పునఃప్రారంభించిన విష‌యం తెలిసిందే. క్యాంటీన్ ప్రారంభ సభలో బ్యాటరీ ఆటో సమకూరుస్తానని ఆటో డ్రైవర్ రజినీకాంత్‌కు చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. గంటల వ్యవధిలో రజినీకాంత్‌కు రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అధికారుల చేత సీఎం అంద‌జేశారు.

Read More

390 సెల్‌ ఫోన్ల రికవరీ, అప్పగింత

– ఎస్పీ గంగాధరరావు విజయవాడ, మహానాడు: కృష్ణా జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన లక్షలాది రూపాయల విలువ చేసే 390 సెల్‌ ఫోన్లను సీసీఎస్‌ పోలీసులు రికవరీ చేశారు. సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా సంబంధిత వినియోగదారులకు వాటిని అప్పగించారు. వీటి విలువ అక్షరాల రూ. 40 లక్షలు. గుడివాడకు చెందిన 202 మంది, మచిలీపట్నానికి చెందిన 96 మంది, పెనమలూరుకు చెందిన 90 మంది […]

Read More

వైసీపీ హయాంలో రైతులకు నష్టం

– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆత్మ డిపార్టెమెంట్ ఉద్యోగుల ఫిర్యాదు విజయవాడ: అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ అధారిటీ ( ఆత్మ)విభాగాన్ని వ్యవసాయశాఖకు అనుసంధానం చేయకుండా గత వైసీపి పాలన అరాచకంగా సాగిందని ఆత్మ డిపార్టెమెంట్ ఉద్యోగులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 2014 ఎన్ డి ఎ ప్రభుత్వంలో ఆత్మ డిపార్ట్ ఉద్యోగులు పనిచేశారని అయితే వైసీపి ప్రభుత్వంలో మాత్రం ఆ విధంగా వ్యవసాయ శాఖకు అనుసంధానం […]

Read More

ప్రభుత్వ చట్టాల పటిష్ఠంతోనే వైద్యులకు రక్షణ

– సీఐటీయూ డిమాండ్ మచిలీపట్నం, మహానాడు: ప్రభుత్వ చట్టాలు పటిష్ఠంగా అమలు చేస్తేనే వైద్యులకు రక్షణగా ఉంటుందని సీఐటీయూ కృష్ణా జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వైద్య ఉద్యోగులు స్థానిక సర్వజన ఆస్పత్రి వద్ద చేస్తున్న ఆందోళనకు సీఐటీయూ కృష్ణా జిల్లా కమిటీ తరఫున ఆయన పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైద్యులపై దాడి చేసిన వారిని […]

Read More

భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

– ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ అనుమతి బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార భూ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా.. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముడా స్థలం కేటాయింపు కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారణ చేసేందుకు గవర్నర్ శనివారం ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో, ఈ కేసులో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కోనున్నారు. […]

Read More

కూలీలను బందీ చేసి, వెట్టి చాకిరీ!

– మానవత్వాన్ని మంటకలిపిన కలప వ్యాపారి మస్తాన్ వలీ నూజండ్ల, మహానాడు: తన వద్ద ఎప్పటికీ పని ఉంటుందని నమ్మించిన ఓ కలప వ్యాపారి వారిని అతని జిల్లాకు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తన మనుషులతో కూలీలను బందీలుగా చేశాడు. గొడ్డుచాకిరీ చేయించుకొని.. నెలకు రూ.3 వేలే ఇచ్చేవాడు. రోజంతా పని చేయించుకున్నా.. నిత్యావసర సరకులు సరిగా అందించేవాడు కాదు. దీంతో వారు గంజినీళ్లతోనే కడుపు నింపుకొనేవారు. అనారోగ్యానికి గురైనా […]

Read More

ప్రాజెక్టును గోదావరిలో ముంచేసినోళ్లు సిగ్గు లేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారు

నిధులను దారి మళ్లించిన మీకు పోలవరం గురించి మాట్లాడడానికి అర్హత లేదు ఏజెన్సీలను మార్చవద్దని పి పి ఏ హెచ్చరిస్తూ లేఖ రాయలేదా? – ఢిల్లీ ఆంధ్ర భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీ : ఐదేళ్లు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేసినోళ్లు సిగ్గు లేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారు .తమ అసమర్ధత పాలనను కప్పిపుచ్చుకోవడానికే సమర్థవంతమైన నేటి […]

Read More

అసత్య ప్రచార పునాదులపై కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది

– బీఆర్ఎస్ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గండిమైసమ్మ చౌరస్తా లోని “దీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్” బ్యాంక్ ముందు రైతు రుణమాఫీ పై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భౌరంపేట్, దుందిగల్ కి చెందిన రైతులు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం డిసెంబర్ 9 లోపు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలరుణమాఫి చేశామని […]

Read More