కొత్త రైళ్ళకు ప్రతిపాదనలు .విశాఖ బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు పై విజ్జప్తి విశాఖపట్నం: డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో శనివారం విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎమ్.శ్రీభరత్, స్థానిక శాసన సభ సభ్యులతో కలసి రైల్వే కు సంబంధించిన వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల ప్రతిపాదనలు, తదితర […]
Read Moreఎన్ టి పి సి – హిందూజా పవర్ ప్లాంట్ లను సందర్శించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ లో ఉన్న ఎన్ టి పి సి మరియు హిందూజా పవర్ ప్లాంట్ లను అనకాపల్లి ఎంపీ మరియు పెందుర్తి ఎమ్మెల్యే సందర్శించి యాజమాన్యంతో చర్చలు జరిపారు. స్థానికంగా ఉన్న పలు సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం, ఎం.పీ సీ.ఎం రమేష్ మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ల నుండి వచ్చే యాష్ పాండ్, దుమ్ము దూళి నుండి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా […]
Read Moreఇంకుడు గుంతలు లేకుంటే భవిష్యత్ లో పెను ముప్పు
– బ్రహ్మ కుమారీస్ ప్రతినిధి రామేశ్వరి సీతమ్మ ధార: ప్రతి ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలు వుండాలి అని బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి రామేశ్వరి కోరారు. సంఘ మిత్ర సోషల్ సర్వీసెస్ (సీతమ్మ ధార) ఆధ్వర్యంలో శనివారం ఆసీల మెట్ట జీ వీ ఎం సీ గాంధీ పార్కులో ఐదు రోజుల అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రకృతి ప్రసాదించిన వర్షపు నీరు వృథాగా కాలువలు ద్వారా సముద్రంలో […]
Read Moreదివ్య దర్శనం పునః ప్రారంభమవుతుందా?
– సాధ్యసాధ్యాలను పరిశీలించిన తిరుమల ఈవో తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం, ఎస్ఎస్ డి టోకెన్ల జారీ కేంద్రాన్ని శనివారం టిటిడి ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. అలిపిరి వద్ద భక్తులకు ఇదివరకు జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్లను పునః ప్రారంభించేందుకు సాధ్యసాధ్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్ఎస్ డి టోకెన్ల జారీ ప్రక్రియను, క్యూ […]
Read Moreగాడిలో పడుతున్న ఉచిత ఇసుక
సీఎం చంద్రబాబు రోజువారి సమీక్షలు.. కలెక్టర్లకు అదేశాలు ఇబ్బందులకు సత్వర పరిష్కారం టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599 బుకింగ్ ప్రక్రియను లోడింగ్ కేంద్రాల నుండి వేరు చేయటంతో సత్ ఫలితాలు అదనపు ఛార్జీల వసూలుపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు అదేశాలు విజయవాడ: ముఖ్యమంత్రి చేస్తున్న రోజువారీ సమీక్షల ఫలితంగా ఉచిత ఇసుక విధానం గాడిలో పడుతోంది. క్షేత్ర స్దాయికి ఉచిత ఇసుక లక్ష్యం చేరాలన్న చంద్రబాబు నాయిడు ఆకాంక్ష సాకారం అవుతోంది. […]
Read More11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు
– ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడ: రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలియ చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, […]
Read Moreబ్లాస్ట్ తర్వాత సహాయ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం
ఏ మాత్రం సక్రమంగా స్పందించని మంత్రులు పరిశ్రమల్లో రక్షణ చర్యల్లోనూ అంతులేని నిర్లక్ష్యం అదేపనిగా గత మా ప్రభుత్వంపై విమర్శల పర్వం ఫార్మా బ్లాస్ట్ బాధితులకు వైయస్సార్‌సీపీ ఆర్థికంగా అండ – మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటన విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని, ఎసైన్షియా ఫార్మాలో బ్లాస్ట్ బాధితులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా అండగా నిలవనుందని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రమాదంలో […]
Read Moreకలెక్టర్లు నెలకు ఒకసారి హాస్టళ్లల్లో నిద్రించాల్సిందే
– సీఎస్ కీలక ఆదేశాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టర్లకు సీఎం శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో నెలకు ఒకసారి నిద్ర చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకోవాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా […]
Read Moreతుగ్లక్ జగన్మోహన్ రెడ్డి అమర్చిన స్మార్ట్ మీటర్లు తొలగించాలి
– సీఎంకు 9 అంశాలతో మాజీ మంత్రి వడ్డే లేఖ! విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడికి తొమ్మిది అంశాలతో కూడిన లేఖను మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరావు రాశారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమి అవసరం లేదు, రియల్ ఎస్టేట్ వాళ్లకి వ్యాపారం చేసుకోవడానికి రాజధాని భూములు […]
Read Moreఅధికారం కోసమే మతతత్వ పార్టీతో కాంగ్రెస్ పొత్తు!
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ విజయవాడ, మహానాడు: అధికారం కోసమే మతతత్వ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్… నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకుంది. 370 ఆర్టికల్ తిరిగి తీసుకొస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అంటుంది. కాంగ్రెస్ […]
Read More