రాజకీయంగా సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీష్

– ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధ రహితం – బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా గడీల్లో పడుకోలేదు ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం – ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదు – అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న సిబ్బందికి అభినందనలు – జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రా ను సిద్ధం చేశాం […]

Read More

మంగళగిరిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్సీ మురుగుడు

మంగళగిరి: రత్నాల చెరువు నందు ఎమ్మెల్సీ పర్యటించి భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను, మగ్గాల షెడ్డులను పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోరారు. అనంతరం ఆయన మీడియా వారితో మాట్లాడుతూ వరదల్లో మరణించిన వారికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్యటించిన వారిలో […]

Read More

నిరాశ్రయులకు నేరుగా ఆహారం అందజేసిన ఎమ్మెల్యే వసంత

– విజయవాడ జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో స్వయంగా పర్యటన విజయవాడ రూరల్:వరద ముంపు ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నేరుగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆహార పంపిణీ, బాధితుల తరలింపు చేపట్టి నిరాశ్రయులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్ఫూర్తిగా సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. విజయవాడలో జక్కంపూడి జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం వరద బాధితులకు, నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్లను స్వయంగా […]

Read More

యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు

– ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విజయవాడ: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురియడంతో సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగింది. 100, 200 ఏళ్ళ చరిత్ర చూసినా ఇంత భారీగా వర్షం.. అదే విధంగా విజయవాడలో వరద ప్రభావం లేదని తెలుస్తోంది. 2009 కంటే ఇప్పుడు భారీగా వర్షాలు కురిసాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఇంత పెద్దస్థాయిలో వరద వస్తుందని ఊహించలేదు. -తెలంగాణ […]

Read More

జక్కంపూడిలో బాబు పర్యటన

– రెండోరోజూ ఆగని పరామర్శ విజయవాడ: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రకాశం బ్యారేజీ దిగువన వరద పరిస్థితిని పరిశీలించి.. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Read More

ఆహారం, మంచినీరు సమయానికి అందించండి

– వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, మహానాడు: బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు సమయానికి ఆహానం, మంచినీరు అందించాలని కోరారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశించారు. ఆహార పంపిణీ ఎంతమేరకు పంపిణీ చేశారో డివిజన్ల వారీగా అడిగి […]

Read More

మానవత్వం మూర్తీభవించిన మహా మనీషి

 డాక్టర్ ఎడుగూరిసందింటి రాజశేఖరరెడ్డి.. తెలుగు ప్రజలంతా తమ సొంత మనిషిలా, ఇంట్లోని వ్యక్తిలా పిలుచుకునే వైఎస్! మానత్వం మూర్తీభవించిన మహా మనీషి. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు. జనరంజక పాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నేత. ప్రజాశ్రేయస్సే పరమావధిగా పాటుపడిన నాయకుడు. రైతు పక్షపాతిగా పేరొందిన కృషీవలుడు. అన్నదాతల కళ్లలో ఆనందం చూడడం కోసం ఎంతకైనా […]

Read More

నా ఆఫీసులను వాడుకోండి

– విజయవాడ, గుంటూరు, రేపల్లెలో ఉన్నాయ్‌ – కరకట్ట పనులను వెంటనే చేపట్టండి – అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు విజయవాడ, మహానాడు: భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే విజయవాడ, గుంటూరు, రేపల్లెలోని నా క్యాంపు కార్యాలయాలను పునరావాస కేంద్రలుగా రెవెన్యూ అధికారులు ఉపయోగించుకోవాలి. గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మతు పనులను రెవెన్యూ అధికారులు వెంటనే చేపట్టాలి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు […]

Read More

అరుదైన రికార్డు బాలయ్య సొంతం- చిరంజీవి

నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మంచు విష్ణు, […]

Read More